ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై భూకబ్జా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్‌లపై భూముల కబ్జాకు సంబంధిం చిన ఆరోపణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం లెక్కచేయకపోవడం గమనార్హం.
తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీతపై సొంత కుటుంబ సభ్యులే భూకబ్జా ఆరోపణలు చేశారు. ఆమెపై ఏకంగా స్పందనలో ఫిర్యాదు రావడం.. ఎంపీ పేరు కూడా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఎంపీ వదిన కళావతి ఆరోపించారు. తిరిగి వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 2006లో తమ ఆస్తులు తన భర్త కృష్ణ కుమార్ తో బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు.
2010లో ఆయన చనిపోయారని కళావతి తెలిపారు. ఆ తర్వాత తమ ఇంట్లో దొంగతనం చేయించి బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఆస్తుల కోసం తమ పిల్లలు న్యాయస్థానంలో పోరాడుతుంటే చంపేస్తామని ఎంపీ వంగా గీత బెదిరిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వంగా గీత దంపతులు, సోదరి కుసుమ కుమారి దంపతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లాకు కళావతి ఫిర్యాదు చేశారు.
కళావతి ఫిర్యాదు మేరకు.. ఎంపీ గీత వ్యవహారం ఇలా.. ఉంది.
భూకబ్జా – 6 ఎకరాల వ్యవసాయ భూమి
భూకబ్జా – 600 గజాల ఇల్లు
బంగారం – 50 కాసులు
నగదు – ఇంట్లో ఉన్న 50 వేల రూపాయలను గీత అనుచరులు దోచుకెళ్లారని ఆమె ఆరోపించారు.
This post was last modified on June 6, 2023 11:04 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…