ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదనకు దిగుతారు.
ఇతర పరిశ్రమలు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉందని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వస్తున్నాయని బల్లగుద్ది మరీ చెబుతారు.
కట్ చేస్తే.. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా నివేదిక రూపంలో ఇవ్వగలరా? అంటే.. మాత్రం ఏపీ మంత్రులు, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కానీ, అదేసమయంలో తెలంగాణ మాత్రం నివేదికలు.. లెక్కలు .. అంటూ..తాము చేసిన ప్రగతిని చెప్పుకొనేందుకు రెడీ అయింది. దీంతో తెలంగాణ దూకుడు ముందు ఏపీ పోటీ పడలేకపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
2022-23 సంవత్సరానికి తెలంగాణలో ఐటీ రంగం పనితీరుపై మంత్రి కేటీఆర్ నివేదికను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 2015 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నా.. కొన్ని నెలలుగా మంత్రి చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా ఈ ఏడాది నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
దేశానికి హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్న నివేదికలు ఆయా రంగాలలో విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాల నూ వివరిస్తాయి. ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పనలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021-22లో జాతీయ సగటు కంటే 9 శాతం పెరిగి ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం నమోదైంది. మరి దీంతో పోల్చుకుంటే.. గత నాలుగేళ్లలో ఏపీ సాధించింది ఏంటో చెబితే.. జగనన్న పాలనకు ప్రజలు మరింతగా జై కొడతారు కదా! అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 5, 2023 11:27 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…