దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేదీ ప్రకటించింది. అదేసమయంలో ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల(CEO)కు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలు.. ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లపై దృష్టి పెట్టాలని సూచించింది. తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలలో ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వహించరాదని పేర్కంది. ప్రస్తుత పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని, అలా ఉన్నవారిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలని ఆదేశించింది. క్రిమినల్ కేసులు లేవని స్థానిక పోలీస్ స్టేషన్లో డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని అధికారులు డిక్లరేషన్ తీసుకోవాలని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో జరిగే బదిలీలు, పోస్టింగ్ లపై జులై 31లోగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇవీ.. ఎన్నికలు జరిగే తేదీలు
మిజోరాం 17.12.23
చత్తీస్ గఢ్ 03.01.24
మధ్యప్రదేశ్ 06.01.24
రాజస్థాన్ 14.01.24
తెలంగాణ 16.01.24
This post was last modified on June 3, 2023 11:50 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…