Political News

ఢిల్లీకి చంద్ర‌బాబు.. కేంద్ర పెద్ద‌ల‌తో స‌మావేశం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి, రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి వెళ్తారు. అక్కడ పార్టీ పెద్దలను కలిసి రాత్రికి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్ననికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రకరకాల ఊహాగానలు సాగుతున్నాయి. ఢిల్లీ పర్యటనతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం ఉందంటూ పార్టీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. అధినేత పర్యటనపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని పార్టీ వర్గాలు తెలిపాయి.

2019 ఎన్నికల తర్వాత ఆజాది కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోడీని చంద్ర బాబు కలిశారు. జీ 20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో మరోసారి భేటీ అయ్యారు. తరచూ టచ్లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు మోడీ సూచించిన విషయం తెలిసిందే. తాజా ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.  

అంతకుముందు 2022 డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం జీ20 సమాఖ్యపై నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. అంతకుముందు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా లేవనెత్తాల్సిన‌ విషయాలపై చర్చించారని సమాచారం.

This post was last modified on June 3, 2023 4:00 pm

Share

Recent Posts

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

4 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

5 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

9 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

10 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

11 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

11 hours ago