టీడీపీ అంటేనే వైసీపీ నేతల్లో భయం పట్టుకుందా? చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు అంటే.. వైసీపీ నాయకులు హడలి పోతున్నారా? తమ ప్రభుత్వ లోపాలను.. తమ నాయకుల అవినీతిని ఎండగడుతున్న తీరుతో వారు బెంబేలెత్తుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేష్‌లు ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాళ్లు విసిరేలా.. యువతను ప్రోత్సహిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.
చివరకు.. ఇటీవల జరిగిన మహానాడులోనూ సాక్షాత్తూ ఎంపీ మార్గాని భరత్ ఫ్లెక్సీలు కట్టి.. కవ్వింపులకు దిగిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే, ఇలాంటి కవ్వింపు చర్యలతో వైసీపీ సాధించేది ఏంటి? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. మీరు కూడా పాదయాత్రలు చేశారు. మీరు కూడా సభలు పెట్టుకున్నారు. అప్పట్లో ఇలా టీడీపీ ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారా? అనేది నెటిజన్ల సూటి ప్రశ్న.
తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం అయింది. నిజానికి బలమైన ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఈ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాలతో పోలీసులు కూడా సహకారం అందించలేదని టీడీపీ నాయకులు విమర్శించారు.
ఇంతగా కార్యక్రమం హిట్టయిన నేపథ్యంలో వైసీపీ నేతలు.. ఊరుకుంటారా? కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇచ్చి లోకేశ్ను పలకరించారు. లోకేశ్ పై మహిళలు చిన్నారులు పూల వర్షం కురిపించారు. దీనిని ప్రత్యక్షంగా వీక్షించిన వైసీపీ నాయకులు తమ అడ్డాలో టీడీపీకి ఇంత ఆదరణా? అని రగిలిపోయారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే విడిది కేంద్రానికి వెళ్లుతున్న లోకేష్‌పై వైసీపీ కార్యకర్త ఒకరు కోడిగుడ్డుతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే.. కోడిగుడ్డుతో దాడి చేసిన వ్యక్తికి టీడీపీ శ్రేణులు దేహశుద్ది చేశాయి.
This post was last modified on June 2, 2023 2:05 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…