తెలంగాణలో ఏం జరిగినా.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో ఐదు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రారంభమైన దశాబ్ది వేడుకలు కూడా రాజకీయాల కు వేదికగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ బీఆర్ ఎస్.. భారీ ఎత్తున ఈ వేడుకలకు ప్లాన్ చేసింది. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రెడీ అయింది. మేం రాష్ట్రాన్ని తెచ్చాం.. అని బీఆర్ ఎస్ నేతలు చెబుతుంటే.. కాదు, కాదు.. మేమే ఇచ్చాం.. తెలంగాణపై హక్కు మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
దీంతో రాష్ట్రంలో రాజకీయ కాక మరోసారి పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే.. రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్రను స్పష్టంగా చెప్పేందుకు ఆ పార్టీ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేదికగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే 20 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. గాంధీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేం దుకు పీసీసీ సర్వం సిద్ధం చేసింది. విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే గాంధీభవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
ఇక, అధికార పార్టీ బీఆర్ ఎస్ విషయానికి వస్తే.. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన వేళ ఘనంగా వేడుకలు జరగనున్నాయి. తొమిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయం వేదికగా వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన 21 రోజుల పాటు రోజుకు ఒక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
గవర్నర్ పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో దశాబ్ది అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. అయితే.. గవర్నర్ తమిళి సై పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు గత రెండేళ్లుగా సర్కారుకు, రాజ్‌భవన్‌కు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కనీసం అవతరణ దినోత్సవాలకు అయినా.. ఆమెను ఆహ్వానించాలని.. మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కానీ, కేసీఆర్ ఆదిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. మరి తమిళి సై.. తన కార్యాలయంలోనే ఈ కార్యక్రమం చేయనున్నట్టు తెలిసింది.
This post was last modified on June 2, 2023 11:29 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…