తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలవబోతోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను బయటకు రప్పించేందుకు ప్రయత్నాలతో స్పీడ్ పెంచింది. ఘర్ వాపసీ కార్యక్రమం రెండు విధాలుగా ఉండబోతోంది. మొదటిదేమో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్ననేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటం. విషయం ఏదైనా, పేరేదైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావటమే టార్గెట్.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంతో తెలంగాణా నేతల్లో కూడా అధికారంలోకి వచ్చేవిషయమై జోష్ పెరిగింది. తమ మధ్య ఉన్న సమస్యలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయమై ఏకతాటిపైకి రావాలని అధిష్టానం కూడా పదేపదే చెబుతోంది. ఇందుకోసం అధిష్టానం తరపున ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. విభేదాలున్న నేతలను కూర్చోబెట్టి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఫార్ములానే తెలంగానాలో కూడా అప్లై చేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నది.
రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవకపోతే పార్టీ మనుగడే కష్టమైపోతుందన్న విషయం సీనియర్లకు వివరిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అందుకనే పార్టీని కాదని బీఆర్ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, గడ్డం వివేక్ తదితరులతో మాట్లాడేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్ తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
నిజానికి కాంగ్రెస్ లోనే చేరాల్సిన ఈటల వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో బలమైన నేతలుగా ఉన్న వారిని కూడా కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెంటనే వచ్చే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళిద్దరిని ఈ వారంలోనే పార్టీలోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మొదటివారంలో కాంగ్రెస్ ఘర్ వాపసీ స్పీడందుకుంటుందా ?
This post was last modified on June 1, 2023 10:59 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…