Political News

టీడీపీ మేనిఫెస్టో జ‌న‌సేన‌కు ఇష్ట‌మేనా?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెబుతున్నటువంటి జనసేన పరిస్థితి ఏంటి? అసలు జనసేన వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆసక్తిగా మారిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వస్తావని జనసేన చెబుతూ వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా పొత్తులు పెట్టుకుంటామని పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తామ‌ని,  వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వ‌చ్చారు.

అయితే ఇప్పుడు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య‌ మారుతున్నటువంటి వ్యూహాలు,  రాజకీయాల నేపథ్యంలో జనసేన అనుసరించేటటువంటి వైఖరి ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది. జనసేన ఏవిధంగా ముందుకు వెళుతుంది? జనసేన ఏ విధంగా అడుగులు వేస్తుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. మహానాడులో చంద్రబాబు నాయుడు పొత్తుల విషయాన్ని ప్రస్తావించ లేదు. పైగా తాను ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం అనేటటువంటి సంకేతాలను స్పష్టంగా పంపించారనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా టిడిపి ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీగా ఉందనే  సంకేతాలు ఇచ్చారు.

పైగా జనసేన విధానాలు వేరుగా ఉన్నాయి. జనసేన ఉచితలకు చాలా వ్యతిరేకం అని చెప్పి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చి అన్ని వర్గాలకు భారం వేసేదానికి జనసేన వ్యతిరేకమని ఆయన పార్టీ ఆవిర్భావ సభలో గత ఏడాది జూన్ లోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు టిడిపి ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పొత్తులు పెట్టుకుంటే సంయుక్తంగా అన్ని పార్టీలు కలిపి ఒక మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టో పూర్తిగా టిడిపికి మాత్రమే సొంతమైనటువంటి మేనిఫెస్టో. కాబట్టి దీన్నిబట్టి జనసేనకి ఇందులో ప్రమేయం లేదు. మరి జనసేన పొత్తులు పెట్టుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ మేనిఫెస్టోను అంగీకరిస్తుందా? ఈ ఉచితలను అంగీకరిస్తుందా? వేలాది కోట్ల రూపాయలు అవసరం అయ్యేటటువంటి అప్పులు చేయడానికి సిద్ధంగా ఉంటుందా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పై జనసేన అధినేత తరచుగా విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని యువతను సక్రమంగా వినియోగించడం లేదని యువశక్తిని వృధా చేస్తున్నారని, కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన పదేపదే చెప్తున్నారు.  ఈ నేపథ్యంలో జనసేన వ్యూహం ఏంటి అసలు జనసేన ఏం చేయాలనుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో.

This post was last modified on May 31, 2023 3:49 pm

Share

Recent Posts

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

18 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

11 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

12 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

12 hours ago