ఏపీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పేదలకు – పెత్తందార్లకు మధ్య యుద్ధంగా వచ్చే ఎన్నికలను అభివర్ణి స్తున్న విషయం తెలిసిందే. అంటే.. 2024లో జరిగే ఎన్నికలను ఆయన తాను పేదవాడినని.. చంద్రబాబు- జనసేనలు ఆర్థికంగా బలం ఉన్న పార్టీలనీ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు మధ్య ప్రజలు ఎటువైపు నిలబడాలో కూడా .. ఆయన చెబుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. పేదలకు తాను సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబట్టి.. తనవెంటే పేదలు ఉండాలని జగన్ చెబుతున్నారు.
ఒకరకంగా ఆయన ఆదేశిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలోనే ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగు తోంది. జగన్ పేదవాడా? అనే చర్చను టీడీపీ క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. మహానా డు ముగిసిన తర్వాత.. ఈ విషయంపై చంద్రబాబు సహా నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. ప్రజల్లోకి జగన్ పేదవాడా ? అనే విషయాన్ని తీసుకువెళ్లి.. జగన్ చెబుతున్న కథలను నమ్మొద్దని ప్రచారం చేయనున్నారు.
దీంతో ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యం పెరిగింది. టీడీపీ లెక్కల ప్రకారం.. ఇప్పటికిప్పుడు జగన్ ఆస్తి రెండు లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఆయన వ్యాపారాలు దీనికి అదనం. ఈ రెండు లక్షల కోట్లు కూడా స్థిరాస్తిమాత్రమేనని అంటున్నారు. ఇక, సాక్షిమీడియా, భారతి సిమెంటు, ఇండూర్ పవర్ ప్రాజక్టు.. గ్రానెట్ ఫ్యాక్టరీ.. ఇడుపుల పాయ ఎస్టేట్ మాత్రం సెపరేటని వాదిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కు హైదరాబాద్‌లో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబం ద్వారా వచ్చిన ఇల్లు మరొకటి ఉంది.
అంతేతప్ప.. చంద్రబాబుకు స్థిరాస్తులు ఎక్కడా లేవని చెబుతున్నారు. ఇక, జిల్లాల వారీగా పార్టీ పరంగా చూసుకున్నా.. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీకి ప్రతిజిల్లాలోనూ సొంత పార్టీ కార్యాలయం ఉండగా.. ఇప్పటికీ.. టీడీపీకి చాలా జిల్లాల్లో అద్దె భవనాలే ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఎవరు పేదవాడు…? అనే చర్చ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on May 31, 2023 10:20 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…