ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ పై టీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం స్టే సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంలో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాజాగా స్టే జారీ చేసింది.
దీంతో.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ మీద విడుదలకు అవకాశాలు మూసుకుపోయినట్లుగా చెప్పాలి. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను ఆమె సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ధర్మాసనం ఎదుట సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాదనలు వినిపించగా.. గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రపంచంలో 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ తరఫున న్యాయవాది వ్యాఖ్యలు చేయటమే కాదు..
ఇలాంటివి తామెప్పుడూ వినలేదన్నారు. పిటిషనర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని గంగిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పగా.. ఈ రోజు దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి విడుదల అంశంలోతెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
This post was last modified on May 26, 2023 11:08 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…