యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. అహరహం శ్రమిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంతరం ఆయన సమీక్షించుకుంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి క్విక్‌గా తయారై.. వెంటనే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంత మంది వచ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో సమస్యలు తెలుసుకుంటున్నారు.
దీనిపై ప్రత్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి కనిపించేవి కొన్ని ఉంటే.. కనిపించనవి ఈ యాత్రలో చాలానే ఉంటున్నాయి. కొన్ని సామాజిక వర్గాలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలను తన డైరీలో ప్రత్యేకంగా ఆయన రాసుకుంటున్నారు. అదేవిధంగా యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, మహిళలకు వ్యక్తిగత రుణాలు, వడ్డెర సామాజిక వర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, సాయంత్రం పాదయాత్ర ముగించిన తర్వాత.. శిబిరానికి చేరుకుని.. అక్కడే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుండా.. రోజంతా జరిగిన పాదయాత్ర వివరాలను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే సమయంలో పార్టీపరంగా యాక్టివ్‌గా ఉన్న నాయకులు ఎవరు.. ఎవరెవరు.. ఎంత సేపు యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విషయాలను కూడా నారా లోకేష్ నమోదు చేసుకుంటున్నారు.
ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చిందని భావించినా.. ఆయన శిబిరానికి పిలిచి నాయకులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇప్పటి వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్యక్తిగత వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. తద్వారా.. వారికి దీటైన అభ్యర్థులకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్‌లు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువగళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వహించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 3, 2023 1:53 pm
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…