వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒకటో రెండో పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు తలపోస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం కమల నాథులతో కలిసి నడుస్తున్న జనసేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి.. అందరం కలిసి అధికారంలోకి వద్దాం.. అని చెబుతోంది.
అయితే.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కేంద్రంలోని పెద్దలు అనుసరించే వ్యూహాల మేరకు.. వారు అడుగులు వేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం లోపాయికా రీగా వైసీపీతో కలిసి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలానే వ్యవహరిస్తే.. నష్టపోయేది బీజేపీనేనని అంటున్నారు కమల నాథులు.
“మాలో మాకే క్లారిటీ లేదు. వైసీపీని నమ్ముకుంటే.. లోపాయికారీగా అయినా.. ఆ పార్టీతో అడుగులు వేస్తే.. నష్టపోవడం ఖాయం. వైసీపీ మాత్రం మాకు ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు ఇవ్వదు. ఈ విషయంలో మావాళ్లకు కూడా క్లారిటీ ఉంది. కానీ, ఆ పార్టీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా..వచ్చే ఎన్నికల నాటికైనా.. వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది“ అని ఉత్తరాంధ్రకు చెందిన కీలక బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు.
ఇటీవల ఆయన ఓ కీలక ఎన్నికలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే.. టీడీపీతో అంతో ఇంతో చనువుగా ఉండి ఉంటే.. తాను గెలుపు గుర్రం ఎక్కేవాడినని అన్నారు. ఇదే అభిప్రాయంతో సీమ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కడప, అనంతపురంలో పావులు కదుపుతున్న బీజేపీ నాయకు లు.. పొత్తులు లేకుంటే.. నష్టపోతామని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి వేళ్లూ సోము వీర్రాజువైపే ఉన్నాయి. ఆయన చొరవ తీసుకుని.. పార్టీ కోసం పనిచేయాలనే వారు పెరుగుతున్నారు.
This post was last modified on May 23, 2023 4:49 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…