Political News

కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన

తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన నిజాల్ని వెల్లడించారు చారిత్రక పరిశోధకుడు.. తెలుగు ప్రాంతాల చరిత్ర గురించి పలు పుస్తకాలు రాసిన ప్రముఖుడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్.

తెలుగు వారికి చరిత్ర అన్నదే లేదనే మాటకు భిన్నంగా.. అందరికి అర్థమయ్యేలా ఆయన చరిత్రను తేలిగ్గా అర్థమయ్యేలా పెద్ద ఎత్తున పుస్తకాలు రాసిన ప్రముఖుడిగా ఆయన్ను చెప్పొచ్చు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాన్ని వెల్లడించారు. తాను చారిత్రక పరిశోధకుడినని చెబుతూ. ‘‘ఎనిమిదో శతాబ్దం నాటికి కాపు.. కమ్మ.. రెడ్డి కులాలు వేర్వేరు కావు. దాని తర్వాతే అవి మూడుగా మారాయి. కాపు అంటే పొలాలను కాపు కాసేవారు. రెడ్డి అంటే రట్టోడి.. రాష్ట్రకూటులు వీరు. దేశానికి రెడ్లు రక్షణ కల్పించారు. కమ్మవాళ్లకు కరికాల చోళుడికి లింకులు ఉన్నట్లుగా శాసనాలు లభించాయి’’ అని చెప్పుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ ప్రాంతాన్ని కమ్మవాళ్లు పాలించారని దీనికి సాక్ష్యంగా ముమ్మడి నాయకుని శాసనం ఉందని చెప్పారు. అప్పట్లో కనౌజ్ ప్రాంతాన్ని కన్యా కుబ్జా అని పిలిచేవారని.. దాన్ని కమ్మ వాళ్లు పాలించారన్నారు. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు మెల్లిమెల్లిగా విడిపోయినట్లు చెప్పారు. కళా రంగంలో ఏపీకి చాలా అన్యాయం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చాలామంది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా ఇవ్వలేదన్నారు. ‘‘ఆ మహాపురుషుడికి కులాన్ని అపాదించి భారతరత్న రాకుండా చేశారన్నారు. ఎంజీఆర్ కు భారతరత్న ఇవ్వటంలో ఉన్న లాజిక్ ఏమిటి? ద్రవిడ రాజకీయాల్లో ప్రయోజనం కోసం ఆయనకు భారతరత్న ఇవ్వొచ్చు. సచిన్ టెండూల్కర్.. లతా మంగేష్కర్ కు భారతరత్న ఇస్తారు. ఎన్టీఆరర్ కు మాత్రం ఇవ్వరు. అనాదిగా ఆంధ్రులు వాళ్లు చేయని తప్పులకు అనాదిగా శిక్ష అనుభవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

This post was last modified on May 22, 2023 6:40 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago