కొన్ని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అలానే ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన ఎన్నికలు… ఏపీలో 2024లో జరగబోయే ఎన్నికలకు సంబంధం ఉంటుందా? అంటే..ఉంటుందనే అంటున్నారుపరిశీలకులు. ప్రతి పక్ష పార్టీలను పక్కన పెడితే.. కర్ణాటకలో బీజేపీ ఓటమికి.. ప్రధానంగా ఆపార్టీ అనుసరించిన అంశాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. అధికారం ఉందని.. తమకు తిరుగులేదని.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని ఒకరకంగా రెచ్చిపోయిన కర్ణాటక బీజేపీ నేతలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఎక్కడికక్కడ అవినీతి, ఇష్టానుసారంగా వ్యవహారం, కులాల కుంపట్లు రాజేయడం, పనుల్లో కమీషన్లు, ప్రజలను విస్మరించడం వంటివి బీజేపీకి ప్రధానంగా తగిలిన ఎన్నికల శరాఘాతాలు. వీటి నుంచి కోలుకునే ప్రయత్నం చేయకపోవడం ఒక చిత్రమైతే.. మరో చిత్రమైన విషయం.. వీటిని ప్రతిపక్షాలు పదే పదే చెబుతున్నా.. ఖాతరు చేయకపోవడం.. అన్నింటినీ కట్టగట్టి రాజకీయ కోణంలోనే చూడడం, క్షేత్రస్థాయిలో అంతా బాగుందనే ధీమా వంటివి కమల నాథుల పుట్టి ముంచాయి. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు దక్కించుకున్న కమల నాథులు ఇప్పుడు దానిలో సగానికి మించిన ఫలితంతో ఘోర అవమానం పొందారు.
కట్ చేస్తే.. ఇదే పరిస్థితి ఏపీలో వస్తుందా? అంటే.. ఔననే వారు ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. ఏపీలోనూ సేమ్ టు సేమ్ పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. అన్నింటా కమీషన్లకు కక్కుర్తి పడుతున్న నేతా గణం, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెబుతున్నా.. పట్టించుకోకుండా అంతా బాగుందనే వ్యవహారం.. ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతుండడం.. అవినీతి పెచ్చరిల్లడం.. వంటివి వైసీపీకి ప్రధాన శకునాలుగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వీటికితోడు అప్పులు.. చేసినా అభివృద్ధి చోదక మంత్రం లేక పోవడం మరింతగా ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి నేత! ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. కర్ణాటక ఫలితాలకు.. ఏపీ ఎన్నికలకు కార్యాకారణ సంబంధం ఖచ్చితంగా ఉంటుందనే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 14, 2023 10:52 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…