బాగా డబ్బున్నంత మాత్రాన హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిపోతారని గ్యారెంటీ లేదు. అదే సమయంలో రాజకీయంగా ఘన వారసత్వం ఉన్నంత మాత్రాన ఆ రంగంలో విజయవంతం అవుతారని కూడా చెప్పలేం. ఈ రెండు విషయాల్లోనూ అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఐతే కర్ణాటకకు చెందిన ఒక కుర్రాడికి బోలెడంత డబ్బు, రాజకీయ ఘన వారసత్వం ఉందని.. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు. కానీ రెండు చోట్లా అతడికి తిరస్కారమే ఎదురైంది.
ఈ ఉపోద్ఘాతం అంతా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు.. భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన నిఖిల్ కుమారస్వామి గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ‘బాహుబలి’ తర్వాత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ‘జాగ్వార్’ అనే భారీ చిత్రంతో అతను హీరోగా పరిచయం అయ్యాడు.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక అరంగేట్ర హీరో సినిమాకు అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా అదే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కన్నడలో నిఖిల్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇటు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే.. మరోవైపు కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతను రాజకీయాల్లో అడుగు పెట్టాడు. గత పర్యాయం మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాడు. కానీ ఆ నియోజకవర్గం నుంచి అంబరీష్ భార్య, తెలుగు నటి సుమలత అతడిపై విజయం సాధించారు.
ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర స్థానం నుంచి నిఖిల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. అక్కడా తిరస్కారం తప్పలేదు. ఆరంభంలో కాసేపు ఆధిక్యంలో ఉన్న నిఖిల్.. తర్వాత వెనుకబడ్డాడు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో అతను చిత్తుగా ఓడిపోయాడు. ఇది నిఖఇల్ తల్లి ఎమ్మెల్యేగా ఉన్న స్థానం కావడం విశేషం. కుటుంబానికి మంచి పట్టున్న స్థానాన్ని నిఖిల్‌కు ఇచ్చినా అతను గెలవలేకపోయాడు. ఇటు హీరోగా, అటు రాజకీయ నేతగా ఫెయిలైన కొడుకును చూసి కుమారస్వామి తల పట్టుకుంటూ ఉంటాడనడంలో సందేహం లేదు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించడం కూడా కుమారస్వామికి పెద్ద షాకే.
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…