ఒకవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అదే సమయంలో మరో వైపపు రిసార్ట్ రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెరదీశాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉదయం 11 గంటల సమయా నికి కాంగ్రెస్ 115 స్థానాల్లోను, బీజేపీ 78 స్థానాల్లోను, జేడీఎస్ 24 స్థానాల్లోనూ ముందంజలో ఉంది.
దీంతో రిసార్టు రాజకీయాలు పుంజుకున్నాయి. దీనికి కారణం మేజిక్ ఫిగర్ 113కు ఏ పార్టీ కూడా చేరువయ్యే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పుంజుకున్నా.. 115 స్థానాలకే పరిమితం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే.. జేడీఎస్ మరోసారి కీలకం కానుంది. ఎట్టి పరిస్థితిలో ఉన్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ-జేడీఎస్ కలిసి.. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మేల్యేలను ఫిరాయించేలా ప్రోత్సహిస్తే.. అప్పుడు రంగం మొత్తం మారిపోతుంది.
ఈ క్రమంలోనే రిసార్టు రాజకీయాలకు తెరదీశారా? అనే చర్చ జరుగుతోంది. అంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గోవా.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇలాంటి అనుభవాన్ని పొందింది. తన పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఫిరాయించేలా చేస్తున్నారని ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా.. కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీంతో రిసార్టు రాజకీయాలైనా చేసిన తన పార్టీ వారిని కాపాడుకునే ప్రయత్నం లో ఉండే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో పలు ఫేమస్ హోటళ్లలో రూమ్‌లు బుక్కయ్యాయి. ప్రముఖ హోటళ్లలో 58 రూములు బుక్ అయినట్టు తెలుస్తోంది. నోవాటెల్ హోటల్లో – 20, పార్క్ హయత్ హోటల్లో – 20,
తాజ్ కృష్ణ హోటల్లో – 18 రూమ్‌లను కర్ణాటక కు చెందిన కొందరు నేతలు బుక్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ పరిణామంతో .. కర్ణాటక రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…