జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యూహం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లు గెలివాలన్న తపనతో ఆయన మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను రెండు చోట్ల ఓడిపోయి, పార్టీకి కేవలం ఒక సీటు సాధించుకున్న పవన్ ఇప్పుడు మాత్రం అంతటి దీనస్థితిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తేనే తమకు డిమాండ్ చేస్తే సత్తా వస్తుందని పవర్ స్టార్ విశ్వాసం. అందుకే ఆయన ప్రతీ స్టేట్ మెంట్ ఆలోచించి, ఆచి తూచి వదులుతున్నట్లుగా కనిపిస్తుంది.
15 శాతం ఓట్ షేర్….?
తమ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో కూడా పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. తమకు బాగా బలమున్న చోట 30 నుంచి 36 శాతం ఓట్లు వస్తాయని, ఏపీ మొత్తంగా 14 నుంచి 15 శాతం వరకు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలువురు సీనియర్ విశ్లేషకులు చెబుతున్న మాటలకు, పవన్ ప్రకటనలకు మ్యాచ్ కావడంతో ఆయన పూర్తి సమాచారంతోనే ఈ ప్రకటనలు చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది.
ఈసారి కాపుల ఐక్యత
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ మంది కాపు ఓటర్లు పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపారు వైసీపీ ప్రభంజనంలో గోదావరి జిల్లా కాపులు జగన్ పార్టీ వైపు నిలిచారు.. జరిగిన తప్పు తెలుసుకున్నామని, పవన్ ను ఓడించి తప్పు చేశామని చాలా మంది కాపు ఓటర్లు ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారు. దానితో కాపు ఓట్ కన్సాలిడేషన్ పై జనసేన ఎక్కువ దృష్టి పెట్టింది. తాము అనుకున్న 15 శాతం ఓట్లు రావాలంటే కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు సామాజిక వర్గాల ఓట్లు ఏకమొత్తంగా తమ వైపుకే రావాలని జనసేన ఎదురుచూస్తోంది. ఈ దిశగా ఓట్లు చీలకుండా చూడాలంటూ ఓటర్లకు సంకేతాలిస్తోంది. మీటింగుకు వచ్చిన చప్పట్లు కొడితే చాలదని, ఓట్లు కూడా వేయాలని పవన్ పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు..
వైసీపీలో టెన్షన్
పవన్ కల్యాణ్ వ్యూహాలతో అధికార వైసీపీ కాస్త టెన్షన్ పడుతున్న మాట కూడా వాస్తవం. వరుసగా రెండు రోజుల పాటు ఆయన మాట్లాడితే వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తెగ ఉడికిపోయి తిట్లదండకం అందుకున్నారు.
పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగంలో ఇదే చెప్పారు. తాను ఏదైనా మాట్టాడగానే బుడతల్ని రంగంలోకి దించుతారని.. వారికి ఎందుకు సీఎం పదవి ఇవ్వరని ప్రశ్నించారు. అయినా అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. పైగా వారు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. వైసీపీలోని ఫ్రస్టేషన్ కు అదే పెద్ద రీజన్, బహుళా పవన్ కు కావాల్సింది కూడా అదే కావచ్చు…
This post was last modified on May 13, 2023 11:07 am
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…