రా! దమ్ముంటే.. చర్చకు సిద్ధం. నాపై చేసిన ఆరోపణలు నిరూపించు. లేకపోతు.. ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్లిపో! నీ అబ్బ (సీమ భాష) నువ్వు కర్నూలుకు చేసింది ఏంటి?
అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. టీడీపీ యువనాయకుడు నారా లోకేష్‌కు సవాల్ రువ్వారు. ఆయన చేస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కర్నూలులో పాదయాత్రలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ఏం జరిగిందంటే..
కర్నూలు సిటీలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. యువగళం పాదయాత్ర ఎస్టిబిసి కళాశాల మైదానం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు అడ్డుకోగా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. అదేసమయంలో ఎమ్మెల్యే హఠాత్తుగా దూసుకువచ్చారు.
మైనార్టీల సమావేశ సభలో నారా లోకేష్ తనపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. తనతో లోకేష్ చర్చకు రావాలని ద్విచక్రవాహనంపై పాతబస్తీలో నారా లోకేష్ యాత్రకు ఎదురుగా వెళ్లారు. పెద్ద ఎత్తున హాఫీజ్ ఖాన్ అనుచరులు సైతం రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హాఫీస్ ఖాన్ మీసాలు మెలేస్తూ. నారా లోకేష్‌తో పాటుగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దమ్ముంటే.. రా! చర్చిస్తాం.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. అని విమర్శలు గుప్పించారు.
This post was last modified on May 9, 2023 7:00 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…