గత ఏడాది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. వరుసగా మరోసారి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టారు. అక్కడ మోడీ హవానే ఎక్కువగా నడిచింది. పేరు, ఊరు కూడా.. ఆయనవే కనిపించాయి. వినిపించాయి. ఆ తర్వాత.. హిమాచల్ ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అది పెద్దగా లెక్కలోకి రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఒకింత బొటాబొటిగానే అధికారం దక్కించుకుంది.
అయితే.. ఇప్పుడు గుజరాత్‌తో సరితూగగల రాష్ట్రం కర్ణాటక. గుజరాత్‌లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. కర్ణాటకలో మరో 42 స్థానాలు అధికంగా ఉన్నాయి. అయితే.. అక్కడా ఇక్కడా కూడా.. బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అదే సమయంలో ప్రధని మోడీ ఫేసే తమను గెలిపిస్తుందని..అక్కడ భావించినట్టు గానే కర్ణాటకలోనూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి కర్ణాటక ప్రాధాన్యం పెరిగిపోయింది.
అంతేకాదు.. దక్షిణాది రాష్ట్రాల పై ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కర్ణాటక ఒక గేట్ వే లాంటిదిగా కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీఎం మోడీకి కర్ణాటక రాష్ట్రం ఇంపార్టెంట్‌గా మారింది. పైగా.. పార్లమెంటు స్థానాలపైనా.. ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(మే 10) మెజారిటీ ఫిగర్ సాధించే అవకాశం ఉన్నపార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుంది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల రాష్ట్రాలతో పోల్చుకుంటే.. కర్ణాటక అందుకే ప్రధాని మోడీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే.. మోడీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రచారం చేశారనేది పరిశీ లకుల మాట. అదేసమయంలో 2024 నాటికి దేశవ్యాప్తంగా కాషాయ జెండానే ఎగరాలనే సంకల్పం కూడా కమల నాథులను ముందుండి నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా చూసుకున్నా.. మోడీకి కర్ణాటక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయనేది విశ్లేషకుల అంచనా.
This post was last modified on May 12, 2023 11:00 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…