పైకి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను తిట్టిపోస్తున్నారు. మీడియాలో ఫస్ట్ పేజీల్లో హైలెట్ అవుతున్నారు. అయితే.. ఇది సరిపోతుందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చంద్రబాబు చెబుతున్నట్టుగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికీ నిజం.
పైకి అంతా బాగుందని ఎంత చెప్పుకొన్నా.. మేడిపండు చందంగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని యాభై నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందిగానే ఉందని తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో 2009 నుంచి టీడీపీ వరుసగా పరాజయం పాలవుతోంది. గత 2019 ఎన్నికలతోపాటు 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది.
అంతకు ముందు 2009 ఎన్నికల్లోనూ ఇవే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో టీడీపీ ఓటమి పాలైంది. అంతేకాదు.. వరుసగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ.. చంద్రబాబు ప్రయోగం ఫలించలేదు. ఆయా నియోజకవర్గాల్లో వరుస పరాజయాలను నాయకులు లైట్ తీసుకుంటున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మాత్రం అంచనా వేయలేక పోతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల పై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు.
ఈ నియోజకవర్గాలు టీడీపీకి డేంజర్: రాజాం, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, రంపచోడవరం, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, ఆలూరు, జి.డి.నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు. మరి ఇప్పటికైనా.. చంద్రబాబు పైపై మెరుగులు మాని.. క్షేత్రస్థాయిలో దృష్టి పెడతారో లేదో చూడాలి.
This post was last modified on May 6, 2023 3:25 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…