ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతా ల వారికి స్థలాలను కేటాయిస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్ – 5 జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో సుమారు 1148 ఎకరాల స్థలాన్ని పేదలకు జగనన్న ఇళ్లు పథకం కింద పంపిణీ చేయా లని నిర్ణయించింది. అయితే.. రాజధాని కోసం భూములు ఇచ్చామని పేర్కొన్న రైతులు.. దీనిని ఒప్పుకోవ డం లేదు.
ఈ క్రమంలోనే సుదీర్ఘ న్యాయపోరాటం కూడా చేశారు. ఇటు ప్రభుత్వం.. అటు రైతులు కూడా తీవ్ర వాదోప వాదాలు వినిపించారు. ఒక దశలో ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంపై సుప్రీంకోర్టు వరకు కూడా రైతులు వెళ్లారు. అయితే.. మళ్లీ ఈపిటిషన్లను హైకోర్టులోనే విచారించాలన్న సుప్రీం ఆదేశాలతో తిరిగి ఇక్కడే విచారణ చేపట్టారు. మొత్తంగా పరిశీలిస్తే.. తాజాగా హైకోర్టు దీనికి సంబంధించి సంచలన ఆదేశాలు జారీ చేసింది.
‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు త్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన రైతుల పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు
This post was last modified on May 6, 2023 12:06 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…