కేరళలోని యువతులను అపహరించి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రస్థావరాలకు విక్రయిస్తున్నారనే కథాంశంతో రూపొందించిన ది కేరళ స్టోరీ
పై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దీనిని మేదావులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కూడా కోరుతున్నాయి. అయితే.. ఇంత ఆందోళనలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు పోతోంది. అంతేకాదు.. తాజాగా ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ ది కేరళ స్టోరీ
సినిమా ప్రస్తావన తెచ్చారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే కేరళ స్టోరీ అనే సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే యత్నం చేస్తోందని బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్‌తో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
బీజేపీ మొదట్నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్‌కు కడుపులో నొప్పి పుడుతుందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని మోడీ మండిపడ్డారు. డబ్బుతో తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ది కేరళ స్టోరీ
కాంగ్రెస్‌కు కడుపునొప్పి పుట్టిస్తోందని అన్నారు.
కేరళలో సుమారు 20 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ది కేరళ స్టోరీ
ని రూపొందించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా వెల్లడించారు. అయితే.. ఇదంతా కల్పితమేనని అధికార పార్టీ వాదన. మొత్తానికి అనేక వివాదాల నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లలో కి రానుంది.
This post was last modified on May 6, 2023 12:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…