విశాఖపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకుంటానని.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా విలసిల్లే చేస్తానని సీఎం జగన్ చెప్తున్నా ఇంతవరకు ఆయన వచ్చింది లేదు.. రాజధాని చేసింది లేదు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాకపోయినా రాయలసీమకు చెందిన రెడ్లు కొందరిని మాత్రం ఉత్తరాంధ్రలో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోంది.
ఈ సూచనలు తెలిసి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అసంతృప్తి చెందుతున్నారని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో రాయలసీమవాసులు బిజినెస్‌లు, కాంట్రాక్టులతో హల్చల్ చేస్తున్నారని.. రాయలసీమ వారి సంస్థలు ఉత్తరాంధ్రలో వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేక్ ప్రాజెక్టులు చేస్తున్నాయని.. ఇక రాజకీయాల్లోనూ వారే ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంతో పాటు విశాఖపట్నంలోని ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈసారి వైసీపీ రాయలసీమకు చెందిన వారిని పోటీ చేయించబోతున్నట్లు చెప్తున్నారు. గతంలో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ విశాఖ పార్లమెంటు సీటుకు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అయితే, ఈసారి ఆ నంబర్ పెంచబోతున్నారని.. ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం చేయకుండా ఉత్తరాంధ్రలోని ఇతర నియోజకవర్గాలలోనూ రాయలసీమ నేతలను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పేరు మొదట వినిపిస్తోంది. ఇచ్చాపురంలో సిటింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఈసారి కూడా టీడీపీ నుంచే పోటీ చేయబోతున్నారు. అయితే, అక్కడ వైసీపీ నుంచి రాయలసమీకు చెందిన ఓ వస్త్రవ్యాపారి పోటీ చేస్తారని తెలుస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని వివిధ మున్సిపాలిటీలలో షాపింగ్ మాల్స్ ఉన్న ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారు. కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడాయన ఇచ్చాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు.
ఇచ్చాపురం వైసీపీలో గత ఎన్నికలలో పిరియా సాయిరాజ్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన భార్యకు శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్ఛాపురానికి చెందిన మరో వైసీపీ నేత నర్తు రామారావును ఇటీవలే ఎమ్మెల్సీ చేశారు. ఇచ్ఛాపురంలో గతంలో అనేక మంది స్థానికేతరులు ఎమ్మెల్యేలయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన ఎంవీ కృష్నారావు ఇచ్చాపురం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉత్తరాదికి చెందిన నరేశ్ కుమార్ అగర్వాల్ కూడా ఓసారి ఎమ్మెల్యే అయ్యారు.
గత ఎన్నికలలో ఓటమి పాలైన పిరియా సాయిరాజ్ ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్‌కు నియోజకవర్గం సానుకూలంగా ఉండడంతో వైసీపీ అధిష్ఠానం అక్కడ కొత్త అభ్యర్థిని ట్రై చేయాలనుకుంటోంది. సాయిరాజ్ స్థాయిలో వేరే అభ్యర్థి ఎవరూ అక్కడ లేరు. నర్తు రామారావును కూడా ఎమ్మెల్సీగా పంపించడం, సాయిరాజ్ భార్యను జడ్పీ చైర్మన్ చేయడంతో ఈసారి ఆ రెండు కుటుంబాలకు టికెట్ రాకపోవచ్చని.. అలాంటప్పుడు స్థానికంగా బలమైన నేతలు లేనందున బయట నుంచి వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి అక్కడి వైసీపీలోని అన్ని వర్గాలు సహకరించేలా అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రలో వైసీపీ రాయలసీమ పాలిటిక్స్ మొదలైనట్లే కనిపిస్తోంది.
This post was last modified on May 6, 2023 8:41 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…