వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకునే ఖాయమనే విషయం తరచుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరు సీఎం అవుతారు? అనే విషయం కూడా ఆసక్తిగా మారింది. కొన్నాళ్ల కిందట కాపు నాయకులు అందరూ కూడా భేటీ అయి.. సీఎంగా పవన్‌ను చూడాలని జనసేన అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అయితే.. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇవి దన్నుగా నిలిచాయి.
తాను అధికారంలోకి రావడం ఖాయమని.. తాము అధికారంలోకి వచ్చాక.. తొలి సంతకం.. సుగాలి ప్రీతి వ్యవహారంపై చేస్తానని.. తర్వాత సంతకం.. కౌలు రైతుల ఆత్మ హత్యల నివారణపై ఉంటుందని.. ఇలా నాలుగు సంతకాల గురించి పవన్ తన సభల్లో ప్రస్తావించారు. అయితే.. టీడీపీతో చేరువ అవుతున్న కొద్దీ ఈ దూకుడును పవన్ తగ్గించారు.వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చేస్తామని.. అదేసమయంలో రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దీనిని బట్టి టీడీపీతోచేరువ అయ్యాక.. పవన్ సీఎం వ్యాఖ్యలు తగ్గుతూ వచ్చాయి. ఇక, ఆదిలో జనసేన కీలక నాయకుడు నాగబాబు కూడా పవన్ సీఎం అంటూ.. కొన్నాళ్లు ప్రచారం చేసినా.. తర్వాతతగ్గారు. కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలోనూ పవన్ సీఎం అవుతారో లేదో.. తెలియదు కానీ.. ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తాం అని నాగబాబు కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే.. సీఎం సీటును చంద్రబాబుకు ఇచ్చి.. రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్కలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి నాగబాబు.. ఈ సీఎం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలోకి దిగుతారని.. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సీఎం పవన్ అయిన తర్వాత.. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ జవాబు దారీ తనాన్ని తీసుకువస్తామన్నారు. ముఖ్యంగా ధార్మిక సంస్థలు.. హిందూ దేవాలయాలకు సంబంధించి.. సమూల మార్పులు చేస్తామన్నారు. ఈ విషయం ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్, సీఎంగా పవన్ అనే వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి. మరిదీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on May 5, 2023 3:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…