Political News

వైసీపీ భ‌య‌పడుతోందా?

ఏపీ అధికార పార్టీ వైసీపీ భ‌య‌ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌తిప‌క్షాల దూకుడును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు నెటిజ‌న్లు.అందుకే.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇచ్చిన జీవో 1కి మరింత ప‌దును పెడుతున్నార‌ని వారు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ జీవోపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి . దీంతో న్యాయ పోరాటాలు కూడా జ‌రిగాయి. అయితే.. అనూహ్యంగా జీవో 1పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం పుంజుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం టీడీపీ దూకుడు పై ఉంది. ఒక‌వైపు యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా నారా లోకేష్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌లు చెబుతున్నారు. నారా లోకేష్ కూడా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూనే సెల్పీ ఛాలెంజుల‌తో స‌ర్కార్‌కు స‌వాళ్లు రువుతున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నేత‌ల‌పైనా తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, చంద్ర‌బాబు కూడా.. ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు.

దీంతో ఏపీలో స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాలు పుంజుకున్న‌ట్టు అయింది. ఇదే జ‌రిగితే.. వైసీపీ స‌ర్కారుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని.. గుండుగుత్తగా ఏక‌ప‌క్షంగా వైనాట్ 175 నినాదంతో దూసుకుపోయే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. భావిస్తోంది. దీంతోనే జన‌వ‌రిలో ఎప్పుడో 1835ల నాటికి బ్రిటీష్ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చి.. జీవో 1గా మార్చి.. అమ‌లు చేసేందుకు రెడీ అయింది. స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్ షోలు అడ్డుకోవ‌డం.. ఈ జీవో ప్ర‌ధాన ఉద్దేశం.

అయితే, దీనిపై తీవ్ర విమ‌ర్శ‌రావ‌డం.. హైకోర్టులో కేసులు ప‌డ‌డం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌కుండానే తీర్పును రిజ‌ర్వ్ చేసింది. దీంతో పిటిష‌న‌ర్లు(టీడీపీ మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌) సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్క‌డ కూడా.. నిర్ణ‌యాన్ని హైకోర్టుకు వ‌దిలేశారు. ఈ ప‌రిణామాల‌తోనే సీఎం జ‌గ‌న్ తాజాగా జీవో 1 పేరు ఎత్త‌కుండానే.. స‌భ‌లు, స‌మావేశాలు.. రోడ్ షోల‌ పై మ‌రింత ఉక్కుపాదం మోపాలంటూ.. ఆదేశాలు జారీ చేశారు. అయితే.. జ‌గ‌న్ కామెంట్లు విన్న త‌ర్వాత‌.. నెటిజ‌న్లు.. వైసీపీ స‌ర్కారు ప్ర‌తిప‌క్షాల‌కు భ‌య‌ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతోందా? అని ప్ర‌శ్నిస్తుండడం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

2 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

8 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago