ఏపీలో ఏం జరుగుతోందంటే.. అంటూ.. జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. ఏపీలో ప్రభుత్వ వర్గాలు.. లేదా .. ప్రభుత్వ పార్టీ వర్గాలు.. తమకు అనుకూలంగా ఉన్న పార్టీ అజెండా ప్రకారం పనిచేస్తారు.
అందుకే.. ఏ విభాగానికి ఆ విభాగం.. కొన్ని నియమాలు, సూత్రాలను నిర్దేశించుకుని.. వాటి ప్రకారం .. అది కూడా సంబంధిత చట్టం మేరకే పనిచేస్తుంటాయి. పాలకులు పెట్టే ఆంక్షలు.. ఆదేశాలు ఎలా ఉన్నప్పటి కీ.. చట్టపరిధిలోనే అధికారులు పనిచేయడం సహజం. ఎక్కడైనా ఒకటి రెండు కేసులు సహజమే అనుకున్నా.. ఏపీలో మాత్రం అందరూ కూడా సర్కారు అనుకూలతే ప్రాథమిక సూత్రంగా, ప్రాథమిక నియమంగా పనిచేయాల్సి వస్తోందని జాతీయస్థాయిలో మీడియా గగ్గోలు పెడుతోంది.
కొన్ని పరిణామాలను గమనిస్తే.. ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్‌ల వరకు.. జరుగుతున్న బదిలీలు.. ఇస్తున్న పో స్టింగులు అన్నీ కూడా.. విధేయతకు వీరతాడుగానే భావించాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాస్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది డీఎస్పీలను బదిలీ చేసినా.. ఒక్క తాడిపత్రి, మంగళగిరి డీఎస్పీలను మాత్రం ప్రభుత్వం కదల్చలేదు. దీనికి కారణంపై అనేక మంది చర్చించారు. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దూకుడను సాధ్యమైనంత మేరకు అడ్డుకుంటున్న చైత్యనును అక్కడే ఉంచారు.
అదేవిధంగా మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో ఉన్న డీఎస్పీనే కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఇక, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి అప్పారా వులను చిట్ ఫండ్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వీరిని పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లారు. పరామర్శించి వచ్చారు.
అంతే..తెల్లారేసరికి ఇక్కడ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాజబాబును ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసేసింది. కేంద్ర పోలీసు బలగాలకు శిక్షణ ఇచ్చే కాలేజీ ప్రిన్సిపాల్‌గా పంపేసింది. ఈ పరిణామం.. పోలీసు వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఏ తప్పూ చేయకున్నా.. ఇలాంటి బదిలీలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ఏపీలో పోలీసుల చట్టం కన్నా.. వైసీపీ చట్టానికే ప్రాధాన్యం ఉందా? అని పోలీసులు ఆఫ్ దిరికార్డుగా చెప్పుకొంటున్నారు.
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…