రాజకీయాల్లోకి వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలనే రూలేమీలేదు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటరవ్వచ్చు. అందుకనే రాజకీయాల్లోకి వివిధ రంగాల్లోని వాళ్ళతో పాటు నేరగాళ్ళు కూడా ఎంటరైపోయారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని చట్టసభలను, పార్లమెంటును చూసినా ఈ విషయం స్పష్టమైపోతుంది. ఇపుడిదంతా ఎందుకంటే తాను రాజకీయాల్లోకి ప్రవేశించకుండా తొక్కేస్తున్నారంటు చికోటి ప్రవీణ్ మండిపోయారు. చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఈమధ్యకాలంలో బాగా పాపులరయ్యారు. ఏ విధంగా పాపులరయ్యారనేది అసలు ప్రశ్నేకాదన్నట్లుగా తయారైపోయింది రాజకీయాలు.
అందుకనే ప్రవీణ్ కూడా గ్యాంబ్లర్ గా, క్యాసినో నిర్వాహకుడిగా తనకు వస్తున్న పాపులారీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం థాయ్ ల్యాండ్ లో క్యాసినో ఆడుతు పట్టుబడ్డవాళ్ళల్లో చికోటి కూడా ఉన్నాడు. దాంతో ఆ విషయం తెలుగురాష్ట్రాల్లో సంచలనమైంది. సరే తర్వాత థాయ్ ల్యాండ్ కోర్టులో ఫైన్ కట్టేసి బెయిల్ తీసుకుని చాలా హ్యాపీగా చికోటి ఇండికాకు తిరిగొచ్చేశాడులేండి. అదే విషయాన్ని ప్రస్తావిస్తు తాను థాయ్ ల్యాండ్ కు వెళ్ళింది పోకర్ ఆడటానికి కాదని కేవలం చూడటానికి మాత్రమే అన్నారు.
పోకర్ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు తనను ఆహ్వానిస్తే వెళ్ళాడట. దాన్ని మీడియా అడ్డదిడ్డంగా ప్రచారం చేసేస్తోందని మండిపోయారు. పనిలోపనిగా తాను రాజకీయాల్లోకి ప్రవేశించటం ఇష్టంలేని వాళ్ళు తనను తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ చికోటి ఏ పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నట్లు ?
ఈ విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఏ రాజకీయపార్టీ తరపున ప్రవేశించాలని అనుకుంటున్నాడు, ఎక్కడనుండి పోటీచేయాలని అనుకుంటున్నాడనే విషయాన్ని మాత్రం సస్పెన్సులో ఉంచేశాడు. ఒకవేళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఏ ఎంఎల్ఏగానో లేకపోతే ఎంపీగానో మాత్రమే పోటీచేస్తాడేమో. కౌన్సిలర్, కార్పొరేటర్, ఛైర్మన్ లాంటి పోస్టులు చికోటికి చాలా చిన్నవి. ఎందుకంటే కొందరు మంత్రులు, ఎంఎల్ఏలతో చికోటికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. పై స్ధాయిలో అంతటి సన్నిహిత సంబంధాలున్న చికోటి రాజకీయ ప్రవేశం కూడా అదేస్ధాయిలో ఉంటుంది కదా. మరి రాజకీయ ప్రవేశం ఎప్పుడుంటుందో చూడాల్సిందే.
This post was last modified on May 6, 2023 8:41 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని…
మంచు ఫ్యామిలీ కలల చిత్రం.. కన్నప్ప. ఈ సినిమా చేయాలని మంచు విష్ణు కెరీర్ ఆరంభం నుంచి కలలు కంటూనే…
ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. అమరావతి పరిధిలోని…
2024 సంవత్సరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అస్సలు కలిసి రాలేదు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ నష్టాలు చూసిన సంస్థ…
మెహ్రీన్ పిర్జాదా.. నాని కృష్ణగాడి వీరప్రేమగాధ చిత్రంతో పెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.మహానుభావుడు,రాజా…
రాజకీయాల్లో ఎలా ఉన్నా..పాలనలో మాత్రం పారదర్శకంగా ఉంటామని.. ప్రపంచానికి సుద్దులు చెప్పే అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా అధ్యక్షుడు జో బైడెన్…