ఈనెలాఖరులో రాజమండ్రిలో జరగబోతున్న టీడీపీ మహానాడులో కీలకమైన డెవలప్మెంట్లు జరగబోతున్నట్లు సమాచారం. అదేమిటంటే వైసీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే ఒక నేత సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్ కారణంగా వైసీపీ నేతలతో పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. కాబట్టి వైసీపీలో ఉండి ఎలాంటి లాభం లేదని డిసైడ్ అయిపోయారట. అందుకనే తొందరలోనే టీడీపీలో చేరిపోవాలన్నది ప్లాన్.
ఇక రెండో నేతేమో ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. అయితే ఎలాంటి ప్రాధాన్యత దక్కటంలేదనే అసంతృప్తితో ఉన్నారట. దాంతో వైసీపీలోనే ఉండి ఉపయోగంలేదు కాబట్టి టీడీపీలోకి మారిపోతే ఎలాగుంటుందని తన మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారట. ఇదే విషయాన్ని వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా చంద్రబాబునాయుడుతో మాట్లాడారట. వీళ్ళని పార్టీలో చేర్చుకోవటమే కాకుండా టికెట్లు ఇవ్వటానికి సుముఖత కూడా చూపారని సమాచారం. కాబట్టి ఇక టీడీపీలోకి వచ్చేయటం లాంఛనమే అన్నది అర్ధమవుతోంది.
అందుకు మహానాడును ముహూర్తంగా పెట్టుకున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు దశాబ్దాల రాజకీయ నేపధ్యం ఉన్నవారే. గట్టి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. అందుకనే వీళ్ళని చేర్చుకోవటం ద్వారా వైసీపీకి ఆయా నియోజకవర్గాల్లో చెక్ పెట్టవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. పైగా ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన అభ్యర్ధులు కూడా లేరు. అందుకనే వీళ్ళిద్దరినీ చేర్చుకుని టికెట్లిస్తే గెలుపు గ్యారెంటీ అని నమ్ముతున్నట్లు సమాచారం.
మరి వైసీపీని వదిలేసి టీడీపీలో చేరబోయే ప్రజాప్రతినిదులు వీళ్ళద్దరేనా లేకపోతే ఇంకా ఉన్నారా అన్నదే సస్పెన్సుగా మారింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ వైసీపీ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరటానికి రెడీగా ఉన్నారు. అయితే కోటంరెడ్డిపై లోకల్ తమ్ముళ్ళు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆనంకు నియోజకవర్గం కన్ఫర్మ్ కాలేదు. ఈ ఇద్దరు కాకుండా ఇంకా ఎవరైనా టీడీపీలో చేరుతారా అన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. బహుశా మహానాడు సమయానికి క్లారిటి వస్తుందేమో చూడాలి.
This post was last modified on May 6, 2023 10:21 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…