ఆమె ఒక దేశానికి ప్రధాని అయ్యేందుకు అన్ని లక్షణాలున్న వ్యక్తి. ఆ మాటకు వస్తే.. ఆమె ప్రస్తుతం ప్రధాని పదవి రేసులో ఉన్నారు. ఇలాంటి కీలక దశలోనూ ఆమె ప్రసవించారు. పండంటి బిడ్డను కన్నారు. తన లక్ ను పరీక్షించుకోనున్నారు. కీలకమైన ఎన్నికల సమయానికి నిండు గర్భిణిగా ఉన్న ఆమె.. తన ఎన్నికల ప్రచారానికి దాన్నో అడ్డంకిగా భావించకపోవటం ఆమె ప్రత్యేకత. ఇంతకీ ఆమె ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. థాయ్ లాండ్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న పేటోంగ్టార్న్ షినవత్రా. మరో రెండు వారాల్లో ఎన్నికలు ఉన్నాయన్న వేళలో.. ఆమె మగ బిడ్డను ప్రసవించారు. తల్లీ.. బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారు.
తాను మగబిడ్డ విషయాన్ని ట్వీట్ రూపంలో దేశ ప్రజలకు తెలియజేశారు. ఆమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె థాయ్ లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవ్రతా చిన్న కుమార్తె. పదిహేనేళ్ల క్రితం తన తండ్రి స్థాపించిన ఫ్యూ థాయ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా వెలువడుతున్న మీడియా అంచనాల ప్రకారం.. ఎన్నికల రేసులో ఆ పార్టీ ముందు వరుసలో ఉన్నారు. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె గట్టి పోటీ ఇస్తున్నారు. వీరి కుటుంబానికి ఉత్తర.. ఈశాన్య థాయ్ గ్రామీణ ఓటర్లు మద్దతు బలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
నిండు గర్భిణీగా ఉండి కూడా ప్రతి రోజు వీడియో కాల్స్ ద్వారా ఆమె ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మద్దతుదారులతో గంటల కొద్దీ మాట్లాడేవారు. ప్రస్తుతానికి ఫ్యూ థాయ్ పార్టీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న ఆమె వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. ఆమె తండ్రి విషయానికి వస్తే 2001 – 2006 మధ్య కాలంలో థాయ్ కు ప్రధానిగా వ్యవహరించారు. అంతేకాదు ఆమె సోదరి ఇంగ్లక్ షినవత్రా సైతం 2011- 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. వీరిద్దరూ థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవటంతో పదవి నుంచి దిగిపోయారు. తమపై నమోదైన అవినీతి కేసుల నుంచి తప్పించుకోవటానికి వీరిద్దరూ విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
వీరు తిరిగి దేశానికి తిరిగి వస్తే కనీసం పదేళ్లు జైలు ఖాయమంటున్నారు. అయినా.. సరే తనకు శిక్ష పడినప్పటికీ తాను దేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లుగా ఆమె తండ్రి కోరుకుంటున్నారు. తనకిప్పుడు ఏడుగురు మనమళ్లు.. మనవరాళ్లు అని. తాను విదేశాల్లో ఉన్నప్పుడే వారంతా జన్మించారని.. తన వయసు ఇప్పుడు 74 ఏళ్లు అని.. తనను దేశానికి తిరిగి రావటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ఈ విషయం మీద పేటోంగ్టార్న్ షినవత్రా సమాధానం చూస్తే.. దిమ్మ తిరిగిపోతుంది. తన ఫోకస్ ఇప్పుడంతా తన తండ్రి దేశానికి తిరిగి రావటం మీద లేదని.. ఎన్నికల మీదనే అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వింటే.. జీర్ణించుకోవటం కాస్త కష్టమే అయినా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం టఫ్ గా ఉండటంలో తప్పు లేదనిపించక మానదు. రాజకీయమా మజాకానా?
This post was last modified on May 2, 2023 2:24 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…