అవతల ఉన్నది ఎవరని చూడరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను పొగిడినా.. జగన్‌ను విమర్శించినా.. ఎటాక్ ఎటాక్ ఎటాక్. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల తీరు. సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనూ ఇలాగే చేశారు. రెండు రోజుల కిందట విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరైన రజినీకాంత్.. రాజకీయాల గురించి మాట్లాడను అని చెబుతూనే.. చంద్రబాబు విజన్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పాడు.
హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్రను కొనియాడుతూ.. పనిలో పనిగా కేసీఆర్ గురించీ ప్రస్తావించాడు. అంతకుమించి ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అన్నింటికీ మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ గురించి కానీ, సీఎం జగన్ గురించి కానీ.. ఎలాంటి విమర్శలూ చేయలేదు. కానీ చంద్రబాబును పొగడ్డమే వైసీపీ వాళ్లకు నచ్చలేదు. కానీ కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నాయకులతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ టీమ్స్ రెచ్చిపోయాయి. రజినీని దారుణాతి దారుణంగా తిట్టిపోశాయి.
ఐతే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి మర్యాద కోసం మాట్లాడిన నాలుగు మాటల్ని పట్టుకుని ఈ స్థాయిలో దాడి చేయడం దారుణం అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లోనే కాక.. సామాన్య జనాల్లోనూ వ్యక్తం అవుతున్నాయి. అందులోనూ క్లీన్ ఇమేజ్ ఉండి, సాత్వికుడిగా పేరుండి.. తెలుగులోనూ భారీగా అభిమానగణం ఉన్న రజినీపై ఇలా దాడి చేయడం ఎవ్వరికీ రుచించడం లేదు. ఈ విషయంలో వైసీపీకి పెద్ద డ్యామేజే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే వైసీపీ ఎటాక్ తర్వాత రజినీకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వైసీపీ మీద టీడీపీ, జనసేన వాళ్లే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా విరుచుకుపడ్డారు.
రజినీని తిట్టడంతో తమిళ నెటిజన్లు కూడా రంగంలోకి దిగారు. అందరూ కలిసి వైఎస్సార్సీపీ సూపర్ స్టార్‌కు క్షమాపణ చెప్పాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. నిన్నంతా నేషనల్ లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. వైసీపీని విమర్శిస్తూ మీమ్స్ మోత మోగించేశారు. రజినీ ‘జైలర్’ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆయన జైలర్‌గా ఉన్న జైల్లో జగన్ ఖైదీగా ఉన్నట్లు మీమ్స్ వేసి వైరల్ చేశారు. అంతే కాక ‘‘మా రాజధాని చెన్నై. మరి మీదేంటో చెప్పండి’’ అంటూ వైసీపీ రాజధాని డ్రామా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. రజినీకి పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా అభిమానగణం ఉంటుంది. వ్యక్తిగా ఆయనకు గొప్ప పేరుంది. అలాంటి వ్యక్తిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి పెద్ద డ్యామేజే చేసుకున్నట్లు కనిపిస్తోంది వైసీపీ.
This post was last modified on May 1, 2023 2:08 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…