సీబీఐ కడపలో.. అవినాశ్ రెడ్డి ‘గడపగడప’లో

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ, అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం రోజురోజుకూ మలుపుతు తిరుగుతుండడంతో పాటు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు. మరోవైపు సీబీఐ బృందం ఒకటి కడపకు చేరుకుంది. దీంతో జిల్లాలో అవినాష్ అరెస్ట్ వ్యవహారంలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరోవైపు అవినాష్ రెడ్డి ఆదివారం ఉదయం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారు. వివేకా కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తున్న ఊహాగానాలు సాగుతున్న సమయంలో.. సీబీఐ బృందం కడపలో మకాం వేసిన సమయంలో ఆయన ప్రజల్లో తిరుగుతుండడంతో అవినాశ్ వ్యూహమేంటి.. సీబీఐ వ్యూహమేంటనేది అంతుచిక్కక స్థానికులు చర్చించుకుంటున్నారు.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణా హైకోర్టు శుక్రవారం వారంరోజు విచాణకు నిరాకరించింది. జూన్ 5 వతేదీన విచారించ నున్నట్లు చెప్పింది.ఈనేపద్యంలో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు..ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం లో పాల్గొనడం, జిల్లా యదావిధిగా తన కార్యకలాపాలను కొన సాగిస్తుండడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆయనకు ముందస్తు బైయిల్ రాకపోవడంతో సీబీఐ తన విచారణలో భాగంగా అరెస్టు చేస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు తోడు సిబిఐ టీం కడపకు చేరుకోవడం జరిగింది. సిబిఐ ఎస్పి ఎస్పీ వికాస్ సింగ్ , అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మలు కూడా కడప వస్తున్నారని సమాచారం. అయితే, సీబీఐ టీం కడప వచ్చింది అవినాశ్ కోసమా.. లేకుంటే ఈ కేసులో ఇంకెవరినైనా అరెస్ట్ చేయబోతున్నారా అనేది చర్చనీయంగా మారింది.