కొన్ని సీజన్స్ షూటింగ్స్ కి ఇబ్బందే. వాటిలో వర్షాకాలం సంగతి చెప్పనక్కర్లేదు. అంతా రెడీ అనుకునే లోపు వర్షాలు కొంప ముంచేస్తాయి. సమ్మర్ కూడా అంతే. యాక్టర్స్ వేడిని తట్టుకుంటూ ఏసీలు లేకుండా అవుట్ డోర్ షూటింగ్స్ చేయలేరు. ఇప్పుడు స్టార్ హీరోలంతా అదే భయంతో ఉన్నారు. మొన్న నాలుగు రోజులు ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో అల్మోస్ట్ హీరోలంతా బ్రేక్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఇక మహేష్ బాబు అయితే సమ్మర్ లో షూటింగ్ కంటే వెకేషన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. బన్నీ కూడా పుష్ప 2 ఘాట్ కి బ్రేక్ రావడంతో సమ్మర్ లో వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ తన కుటుంబంతో అమెరికా వెళ్లిపోయారు.
ఇక సీనియర్ హీరోల సంగతి సరే సరి. చిరు , బాలయ్య , వెంకీ ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీస్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి సమ్మర్ ను స్కిప్ కొట్టేస్తున్నారట. బాలయ్య ,అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. మే నెల స్కిప్ కొట్టేసి జూన్ నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక చిరు కూడా భోలా శంకర్ ఘాట్ ను ఫినిషింగ్ కి తీసుకొచ్చేశారు. ఆగస్ట్ రిలీజ్ కాబట్టి వచ్చే నెల బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది.
వెంకటేష్ కూడా టెంపరేచర్ ఎక్కువ ఉండే మే మంథ్ లో ఘాట్ వద్దని చెప్పేశారట. నాగార్జున అయితే తన కొత్త సినిమాను సమ్మర్ అయ్యాకే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువ ఉండనుందని వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిస్తుండటంతో దర్శక నిర్మాతలు కూడా హీరోలను ఇబ్బంది పెట్టకుండా జూన్ తర్వాతే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…