Political News

జ‌గ‌నే మా భ‌విష్య‌త్తుకు వెన‌కాల‌.. ఇంత పెద్ద షాక్ త‌గిలిందా…!


ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం.. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌.. జ‌గ‌నే మా భ‌విష్య‌త్తు కార్య‌క్రమం. ఈ కార్య‌క్ర‌మాలు ఈ నెల 7న ప్రారంభ‌మై 20న ముగియాల్సి ఉంది. అయితే..దీనికి వ‌స్తున్న స్పంద‌న‌తో సీఎంజ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాల‌ను ఈ నెల 29 వ‌ర‌కు పొడిగించార‌ని వైసీపీ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదేస‌మయంలో ఈ కార్య‌క్ర‌మాల‌కు భారీ ఎత్తున రెస్పాన్స్ వ‌స్తోంద‌ని.. ఇప్ప‌టికి 70 ల‌క్ష‌ల మంది మిస్డ్ కాల్ ఇచ్చార‌ని తెలిపింది.

అయితే..నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. నిజ‌మే మిస్డ్ కాల్ ఇచ్చారు. 70 ల‌క్ష‌ల మంది నుంచి మిస్డ్ కాల్స్ వ‌చ్చిన మాట కూడా వాస్త‌వమే. ప్ర‌జ‌ల్లో రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇది పైపైనే! నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో ఏడాదిపాటు పాల‌న చేయ‌నుంది. దీంతో ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సంక్షేమ ప‌థ‌కాలు మ‌రో ఏడాది పాటు అందాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిలో కీల‌క‌మైన అమ్మ ఒడి, చేయూత వంటి భారీ న‌గ‌దు కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.

అదే స‌మయంలో పింఛ‌ను 3000 రూపాయ‌లు పెంచేకార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి నుంచి అమ‌లు కానుంది. ఇది.. వ‌చ్చే ప్ర‌భుత్వాలు కూడా కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో ల‌బ్ధి దారులు..త‌మ‌కుఇష్టం ఉన్నా లేకున్నా.. వ‌లంటీర్లు, గృహ‌సార‌థులు వ‌చ్చిన‌ప్పుడు వారు చెప్పిన‌ట్టు వింటున్నారు. మిస్డ్ కాల్ ఇవ్వ‌మంటే ఇస్తున్నారు. ఇంటికి స్టిక్క‌ర్ అంటిస్తామ‌న్నా.. స‌రేనంటున్నారు. కానీ, త‌ర్వాతే అస‌లు విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది.

వ‌లంటీర్లు, గృహ‌సార‌థుల‌కు ర‌హ‌స్యంగా వైసీపీ నుంచి ఆదేశాలు వ‌చ్చాయి. మీరు అంటించిన స్టిక్క‌ర్లు వారం త‌ర్వాత‌.. అలానే ఉన్నాయో లేదో ..ప‌రిశీలించాల‌నేది ఈ ఆదేశం. దీంతో వ‌లంటీర్లు గ‌డిచిన రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా అదే ప‌నిచేశారు. స‌గానికిపైగా ఇళ్ల‌కు స్టిక్క‌ర్లు క‌నిపించ‌లేదు. దీంతో ఇదే విష‌యాన్ని వారు పార్టీ అధిష్టానానికి పంపించారు. అంటే.. ప్ర‌జ‌లు వైసీపీ వైపు ఏవిధంగా ఉన్నార‌నేది ఇప్పుడు స్ప‌ష్టంగా అర్ధ‌మైంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి దీనిని ఎలా చూస్తారో చూడాలి.

This post was last modified on April 25, 2023 6:32 am

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

1 hour ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

1 hour ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

2 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

2 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

3 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

3 hours ago