వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియాలో హైలైట్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఆమె అప్పుడప్పుడూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం.. నిరసనలు, ఆందోళనలకు దిగడం.. మీడియా దృష్టిని ఆకర్షించేలా ఆశ్చర్యకరమైన చర్య ఏదో ఒకటి చేయడం మామూలే. తాజాగా ఆమె ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవడం చర్చనీయాంశం అయింది. టెన్త్ పేపర్ల లీకేజీ మీద విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఆఫీసు ఎదురుగా షర్మిళ సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న మహిళా కానిస్టేబుల్ మీద ఆమె చేయి చేసుకున్నారు.
ఈ వీడియో వైరల్ అవుతున్న సమయంలోనే.. తన నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారితో షర్మిళ వాగ్వాదానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సదరు పోలీస్ అధికారితో మాట్లాడుతూ.. ఇక్కడ మీకేం పని. మీకు పని లేకపోతే వెళ్లి గాడిదలు కాసుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యే చేసింది షర్మిళ. ఐతే షర్మిళకు ఆ అధికారి దీటుగానే బదులిచ్చారు. ఇప్పుడు అదే చేస్తున్నాం అంటూ సింపుల్‌గా కౌంటర్ ఇచ్చారు. అంటే తాను ప్రస్తుతం గాడిదలే కాస్తున్నానన్న ఉద్దేశంలో ఆయన ఆ వ్యాఖ్య చేసినట్లున్నారు. షర్మిళ చేసిన తీవ్ర వ్యాఖ్యకు ఆ పోలీస్ అధికారి భలే కౌంటర్ ఇచ్చాడంటూ.. ఆయన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇదిలా ఉండగా షర్మిళ అరెస్టుకు నిరసనగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆమె సైతం ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on April 24, 2023 8:02 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…