కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైన నాటి నుంచి కూడా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అధికార బీజేపీ మరోసారి ఇక్కడ పుంజుకుంటే.. కేంద్రంలో ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకా శం ఉంటుందనే భావన కమలం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఇక్కడ సామదాన భేద దండోపాయా లను పార్టీ వినియోగిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో అనుకూల పరిస్థితిని మరింత పెంచుకుంటోంది.
అయితే.. కీలకమైన నాయకులు.. పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చే పార్టీని శాసిస్తున్న లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎదిగిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటివారు పార్టీకి దూరమయ్యారు. ఇది బీజేపీకి ఊహించని దెబ్బే. అయితే.. అలాగ ని ఈ పార్టీ పెద్దలు చూస్తూ కూర్చోలేదు. తాము చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చిన్నా చితకా పార్టీలను రంగంలోకి దింపారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఈ రకంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటిలో కర్ణాటక రాష్ట్రసమితి కీలకంగా వ్యవహరించనుంది. ఈ పార్టీ ఏకంగా 199 స్థానాల్లో పోటీ చేస్తోంది.వాస్తవానికి ఈ పార్టీ ఆప్ నుంచి పుట్టిందే. ఆప్‌లో నిన్న మొన్నటి వరకు.. యాక్టివ్‌గా ఉన్న రవికృష్ణారెడ్డి అనే ఎంప్లాయ్‌ని బయటకు తీసుకువచ్చి.. ఆయనతో కర్ణాటక రాష్ట్రసమితి పార్టీని ఏర్పాటు చేసేలా మాజీ సీఎం యడియూరప్ప చక్రం తిప్పారు.
దీంతో కర్ణాటక రాష్ట్రసమితిని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉన్నారని భావి స్తున్న ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాల ప్రజల ఓట్లను చీల్చగలిగితే.. బీజేపీ ఒకింత బయటపడినట్టేనని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ కూడా.. బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తోందనే వాదనబలంగా వినిపిస్తోంది. ఈ పార్టీ కూడా ప్రభుత్వవ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నంలో ఉంది. మొత్తంగా.. బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏమవుతుందో చూడాలి.
This post was last modified on April 24, 2023 6:10 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…