రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి సంచలన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. ఆయన సతీమణి భారతి రెడ్డిలను సీబీఐ విచారించాలన్న కొత్త డిమాండ్ ను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.
వివేకా హత్యలో ఇప్పటివరకు విచారించిన వారంతా పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు మాత్రం జగన్ దంపతులేనని వ్యాఖ్యానించారు. వారిద్దరికి సీబీఐ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాల్సిందేనని కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ దంపతుల మీద.. వారి పాత్ర మీదా తొలి నుంచి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్న ఆయన.. అందులో కీలకమైన ప్రశ్నలకు సమాధానాన్ని రాబడితే సీబీఐ విచారణ ముగిసినట్లేనని చెప్పుకొచ్చారు పట్టాభి.
తాను చేసే తీవ్రమైన ఆరోపణలకు కాసిన్ని ఆధారాలు కూడా చూపించాల్సింది. అదేమీ లేకుండా ఇలా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసే ముందు.. అలా ఎందుకు చేయాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. దానికి సంబంధించిన ఆధారాల్ని కూడా ప్రస్తావిస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా నాలుగు నోటి మాటల్ని చెప్పటంతో సరిపోదన్న విషయాన్ని పట్టాభి లాంటి నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
This post was last modified on April 23, 2023 9:38 am
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…