Political News

అవినాష్ అరెస్టుకు లైన్ క్లియ‌ర్‌.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ.. తొలుత సాక్షిగాను.. త‌ర్వాత నిందితుడిగాను సీబీఐ అధికారులు గుర్తించిన క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసుకునే విష‌యంలో అడ్డుకోవ‌ద్ద‌ని.. తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టును ఈ నెల 25 వ‌ర‌కు నిలిపి ఉంచుతూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై సుప్రీకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. సీబీఐ త‌న విచార‌ణ‌ను స్వేచ్ఛ‌గా నిర్వ‌హించుకునే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని సూచించింది.

ఈ మేర‌కు వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ప్రతివా దులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో అవినాష్‌రెడ్డి అరెస్టుకు లైన్ క్లియ‌ర్ అయింద‌ని సునీత త‌ర‌ఫున న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

సునీత త‌ర‌ఫు లాయ‌ర్ ఏన్నారంటే.. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టా ల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణన‌లోకి తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవన్నారు. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందని తెలిపారు. ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించిందని, ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీక‌రించింది.

This post was last modified on April 21, 2023 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

32 minutes ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago