అనూహ్య పరిణామాల నేపథ్యం.. మరో కీలక పరిణామానికి కారణంగా మారుతుందా? ఏళ్లకు ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజుకు దగ్గరగా వచ్చిన వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి ప్రధాని మోడీకి ఇబ్బందిగా మారనుందా? అన్నదిప్పుడుప్రశ్నగా మారింది. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన్ను నిత్యం కలుస్తూ.. చర్చలు జరిపే ఏకైక నేతగా అమిత్ షాను అభివర్ణిస్తారు.
అలాంటి ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటం ప్రధాని మోడీకి ఇబ్బందికరంగా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఐదున అయోధ్యలో రామాలయానికి భూమిపూజకు ముహుర్తంగా నిర్ణయించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురుప్రముఖులు హాజరు కానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి.
ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం అమిత్ షాకు పాజిటివ్ గా తేలటంతో మోడీ పరివారం షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. షా పాజిటివ్ రిపోర్టు.. ఎంతమంది మంత్రులకు వ్యాపించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్న. ఒక విధంగా చూస్తే..అమిత్ షా ప్రైమరీ కాంటాక్టు కింద ప్రధాని మోడీ ఉంటారు.
అలాంటప్పుడు ఆయన కనీసం పది రోజులు హోం ఐసోలేషన్ ఉండాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే.. భూమిపూజకు మోడీ హాజరయ్యే అవకాశాలు తక్కువేనన్న గా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాంటి అనుమానాలు అక్కర్లేదనని.. అయోధ్యకు ప్రధాని మోడీ పక్కా వెళతారని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. భూమిపూజకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో .. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయోధ్యలో భూమిపూజ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తే.. సరిగా అదే సందర్భంలో కరోనా రూపంలో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు.
ముహుర్తానికి మరికొంత టైం ఉన్న వేళ.. ఇప్పుడు ఊహించేవన్ని ఊహలేనని.. వెయిట్ చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదన్న మాట మరికొందరి నోటి నుంచి వస్తోంది. భూమిపూజపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on %s = human-readable time difference 10:57 am
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…