Political News

అంతా తాయత్తు మహిమ..

ఎంబీబీఎస్, ఎండీ అనే ఇంగ్లీష్ వైద్య చదువులు చదివిన వారి దగ్గరకే తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం మంది వెళ్తుంటారు. మూఢనమ్మకాలకు అవకాశం లేకుండా పరిశోధనాత్మకంగా తయారైన ఔషధాలను రాసిస్తారన్న నమ్మకంతోనూ, ఆ మందులను వాడితే త్వరగా రోగం నయమవుతుందన్న విశ్వాసంతోనూ ఆస్పత్రుల దగ్గర జనం బారులు తీరుతుంటారు. 30 సంవత్సరాలకు పైగా ఇంగ్లీషు మందులిచ్చిన ఒక వైద్యుడు మాత్రం ఇప్పుడు రూటు మార్చాడు…

తాయత్తే కాపాడిందని డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన..

తెలంగాణకు ఒక హెల్త్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ గడల శ్రీనివాసరావు. అయనకు సైన్స్ తో సంబంధం లేదు. ఏది కావాలంటే అది మాట్లాడతారు. ఒక సందర్భంలో అనారోగ్యం పాలైతే తన తాతయ్య, అమ్ముమ్మ తాయత్తు కట్టించారని దానితో తాను బతికి బయట పడ్డానని డీహెచ్ చెప్పుకున్నారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన ఇప్తార్ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు పెద్దలు మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారట

ఏసు ప్రభువు కాపాడాడు..

ఒక సందర్భంలో తనను ఏసు ప్రభువు కాపాడాడని కూడా శ్రీనివాసరావు చెప్పుకున్నారు. కరోనా నుంచి మానవాళిని ఏసు ప్రభువే కాపాడారని చెప్పి విమర్శల పాలయ్యారు. మరో సందర్భంలో ఆయన మిరపకాయల హోమం చేయించి అందరి విమర్శలకు లోనయ్యారు..

కేసీఆర్ కు తరచూ పాదాభివందనం..

డీహెచ్ శ్రీనివాసరావు , బీఆర్ఎస్ లో కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నారు. దానితో ఎక్కడ బడితే అక్కడ సీఎం కేసీఆర్ కు పాదాభివదనం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా కాళ్లకు మొక్కడంతో కేసీఆర్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. కొత్తగూడెంలో మంచి పేరు సంపాదించుకునేందుకు ఆయన జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య క్యాంపులు, జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తూ జనంలో నానుతున్నారు.

శ్రీనివాసరావు దూకుడుతో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు టెన్షన్ పట్టుకుంది. కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చి తనకు ఎగ్గొడ్డతారేమోనన్న భయం ఆయనలో పెరుగుతోంది. ఏదేమైనా.. అన్నీ శ్రీనివాసరావు అనుకున్నట్లే జరిగి ఎమ్మెల్యే అయితే అదీ కూడా తాయత్తు మహిమ అంటారేమో. ఏమో తాయత్తు మహిమతో ఆయనే ఆరోగ్య మంత్రి కూడా కావచ్చు. ఎలాగూ డాక్టర్ కదా…

This post was last modified on April 18, 2023 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

16 mins ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

33 mins ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

2 hours ago

రాష్ట్రం వెంటిలేట‌ర్ పై ఉంది: చంద్ర‌బాబు

రాష్ట్రం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని.. అయితే..దీనిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా…

2 hours ago

లక్కీ మీనాక్షి కి మరో దెబ్బ

టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…

2 hours ago