ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు.
ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును మాత్రమే ఎందుకు ప్రస్తావించాల్సొచ్చింది ? ఎందుకంటే మైనస్ మోడీ బీజేపీ దాదాపు జీరో కాబట్టే. ప్రధానమంత్రి కుర్చీనుండి మోడీ పక్కకు తప్పుకున్న తర్వాత బీజేపీ వైభవం చూడాలి ఎలాగుంటుందో. తాను పక్కకు తప్పుకునే లోగానే ఢిల్లీని కూడా బీజేపీ పాలనలోకి తీసుకురావాలన్న కల సాకారం కావటంలేదు. మూడుసార్లుగా కేజ్రీవాల్ గెలుస్తునే ఉన్నారు. మూడోసారి గెలవటమైతే మోడీకి పెద్ద షాక్ లాంటిదే.
అందుకనే ఎలాగైనా కేజ్రీవాల్ అడ్డు తొలగించుకుంటే కానీ ఢిల్లీ బీజేపీకి దక్కదనే విషయం అర్ధమైపోయింది. ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో సరిగ్గా లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇప్పటివరకు కేజ్రీవాల్ పైన ఎక్కడా అవినీతిపరుడనే మరక కూడా లేదు. అలాంటిది మొదటిసారి లిక్కర్ స్కామ్ లో కేజ్రీ పేరు రావటం ఆశ్చర్యంగానే ఉంది. సరే కారణాలు ఏవైనా కానీండి కేజ్రీని సిబీఐ మొదటిసారి విచారించింది. దాదాపు 9 గంటలపాటు 56 ప్రశ్నలు వేసినట్లు సీఎమ్మే చెప్పారు. తాను అన్నింటికీ సమాధానాలు కూడా చెప్పానన్నారు.
ప్రశ్నలు ఏవైనా, సమాధానాలు ఏమి చెప్పినా ఇపుడు గనుక కేజ్రీని పట్టుకోకపోతే ముందు ముందు దొరుకుతారనే గ్యారెంటీలేదు. ఇలాంటి కుట్రల్లో తనను ఇరికించి మోడీ తనను అరెస్టు చేయించేందుకు ప్లాన్ చేసినట్లు కేజ్రీ కూడా బహిరంగంగానే ఆరోపించారు. అంటే కేజ్రీ కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో, మార్గమేదైనా సరే ప్రత్యర్ధులను అడ్డుతొలగించుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా ప్రతిపక్షాల నేతలు నానా గోలచేస్తున్నారు. అయితే వీళ్ళ గోలను ఎవరు పట్టించుకుంటారు ?
This post was last modified on April 17, 2023 11:15 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…