రంగం ఏదైనా.. ఒత్తిళ్లను తట్టుకోవటం.. సవాళ్లను ఎదుర్కోవటం.. అణగదొక్కే వారి సంగతి చూసేందుకు వెనుకాడని ఫైర్ బ్రాండ్ తత్త్వం కొందరికి ఉంటుంది. మహిళల్లో ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. రాజకీయ రంగంలో ఫైర్ బ్రాండ్లను అర్థం చేసుకోవచ్చు.
కానీ.. ఫ్యాషన్.. సినీ రంగాల్లో ఫైర్ బ్రాండ్లకు ఎదురయ్యే సవాళ్లు అన్నిఇన్ని కావు. వీటిని తట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఫైర్ బ్రాండ్ నటీమణులన్నంతనే బాలీవుడ్ లో కొందరు గుర్తుకు వస్తారు కానీ టాలీవుడ్ లో మాత్రం మాధవిలతనే గుర్తుకు వస్తుంది.
చేసిన సినిమాలు తక్కువే అయినా.. తన మాటలతో.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో ఆమె తరచూ వార్తల్లోకి వస్తుంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పటమే కాదు.. తప్పు చేసినోళ్లను ఉతికి ఆరేసే లక్షణం ఆమెలో ఎక్కువే. తాజాగా ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్టు ఒకటి ఆసక్తికరంగా మారింది.
‘‘ఎవరి జీవితాల్లోకి ఎవరూ వెళ్లకపోవటం మంచిదని.. ఇక్కడెవరూ మంచోళ్లు లేరు మడి కట్టుకున్నోళ్లు లేరు.. మీ జీవితం మీరు చూసుకుంటే గొప్పవాళ్లు అవుతారు’’ అని వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత జీవితం ఎవరికి అవసరం లేదన్న ఆమె.. మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
‘‘ఎవరి రాజకీయ కుట్రలకు బలైపోను. ఎవరిని సహించను. నేనెవరికోసం తెర వెనక నటించే పని లేదు. పక్కవాళ్ల జీవితంలో వేలు పెట్టటం సంస్కారహీనం. నీచం’’ అని మండిపడ్డారు. అలాంటి పనులు చేయొద్దని తాను సోషల్ మీడియా సైకోలకు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
‘‘మేం ఎప్పుడూ పక్కోళ్ల మీద పడి ఏడుస్తుంటాం. మాకు వేరే పని లేదు. అదే మా పని అంటూ పక్కింట్లో తొంగి చూస్తూ.. పడకగదిలో కెమెరాలు పెడతాం.. ఫేస్ బుక్ లో దూరి జనాల్ని తిడతామంటే మీ కర్మకు మీరే బాధ్యులు’’ అని ఉతికి ఆరేశారు.
పక్కవారి మంచి కోరుకుంటే బాగుంటారని.. పరాయివాళ్ల నాశనం కోరుకుంటూ.. చావు కోరుకునే చెడ్డోళ్లు.. తమను తాము మంచోళ్లుగా చెప్పుకుంటారన్నారు. ‘‘మన కదలిక పది మందికి సంతోషాన్ని ఇవ్వాలి. అశాంతిని కాదు. మీ మాటలు.. మీ నవ్వు పక్కవారికి ఇబ్బందిగా మారుతుంటే.. మీరు సరిగా లేనట్లు. ఒకరిని సంతోష పెట్టకున్నా ఫర్లేదు.. బాధ పెట్టొద్దు. ఎవరి అశాంతికి కారణం కావొద్దు’’ అని తన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. ఇదంతా ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టారో మాధవిలత వెల్లడించలేదు.
This post was last modified on August 2, 2020 8:51 pm
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…