ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలూకు ఆనవాళ్లను, సాక్ష్యాలను.. ఎవరు చెరిపేశారో.. ఎవరెవరు చేతులు కలిపారో.. పూస గుచ్చినట్టు సీఐబీ వివరించింది. వివేకా హత్య ఆనవాళ్లను.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో కలిసి ఉదయ్ చెరిపేశాడని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో.. ఆయన ను ఎందుకు రిమాండ్‌కు పంపించాలో కూడా సీబీఐ స్పష్టం చేసింది.
గుండె పోటు ప్లాన్ వీరిదే!
వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా హత్య కేసు ఆధారాల చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారు. వివేకానంద రెడ్డి హత్యకు గురైన స్థలంలోని ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారు. విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్‌ను అరెస్టు చేశాం. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు.
ఆ తెల్లవారు జామున ఏం జరిగిందంటే..
సీబీఐ వెల్లడించిన దానిని బట్టి.. వివేకా హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నారు. హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ ఇంట్లోనే శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. హత్య తెలియగానే ఆధారాల చెరిపివేతకు అవినాష్ ఇంట్లో ఎదురుచూశారు. అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి ఫోన్‌చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారు. అవినాష్ ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా కూడా గుర్తించాం. అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికెళ్లినట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించాం. అని సీబీఐ వివరించింది.
This post was last modified on April 15, 2023 9:16 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…