ఏపీ సీఎం జగన్‌పై తరచుగా విరుచుకుపడే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రాజకీయం పరంగా చూస్తే.. సీఎం జగన్‌కు ఆయన పలు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సందర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపులర్ అయింది.
తర్వాత కాలంలో కరోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జగన్‌ను ఏకేశారు. “ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా వైరస్‌ను వదిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్‌లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి పట్టిన ‘జగనో రా’ వైరస్‌ను వదిలించుకునేందుకు మరో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చర్చనీయాంశం చేశారు. అదేవిధంగా జగన్ కాదు.. గజనీ అని పలుసందర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ మోహన్‌రెడ్డి కాదు.. ప్రజలను పీడిస్తున్న ‘జలగ’ మోహన్‌రెడ్డి అని పలు చోట్ల చెప్పుకొచ్చారు.
ఇక, పలు సందర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక, ఈ పరంపరలోనే.. తాజాగా సీఎం జగన్‌కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహన్’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో పనిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.
This post was last modified on April 15, 2023 11:09 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…