Political News

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ ఏం చదువుకున్నారు..

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌.. తమ్మినేని సీతారాం విద్య‌కు సంబంధించిన వివాదం కీల‌క మ‌లుపు తిరుగుతోంది. చినుకు.. చినుకు.. అనుకున్న విష‌యం కాస్తా..ఇప్పుడు తీవ్ర గాలివాన‌గా మారుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విద్యార్హ‌త విష‌యంలోనూ.. తీవ్ర ర‌గ‌డ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీ స్పీక‌ర్‌గా ఉన్న త‌మ్మినేని వంతు వ‌చ్చిన‌ట్టు అయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న త‌మ్మినేని సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం సొంతం చేసుకున్నారు.

గ‌తంలోనే మంత్రిగా ప‌నిచేశారు. కానీ, ఎప్పుడూ రాని వివాదం ఇటీవ‌ల తెర‌మీదికివ‌చ్చింది. ఆయనే స్వ‌యంగా ఇంట‌ర్ త‌ప్పాన‌ని ఒక యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, ఇటీవ‌ల మాత్రం తాను డాక్ట‌రేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నారు. దీంతో టీడీపీ నేత‌లు.. అస‌లు ఏం చ‌దివారంటూ.. దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో టీడీపీ సెగ తమ్మినేనికి పెరిగింది. దీనిపై టీడీపీ నేత న‌న్నూరి న‌ర్సిరెడ్డి.. ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం.

మహాత్మాగాంధీ లా కాలేజీలో తాను అడ్మిషన్ తీసుకున్న‌ట్టు తమ్మినేని గ‌తంలో ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్ల‌ను ఆయ‌న స‌మ‌ర్పించ‌లేదు. అయితే.. ఈ సర్టిఫికెట్‌ల కాపీలను సమాచార హక్కు చట్టం కింద న‌ర్సిరెడ్డి డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఓయూ సేకరించారు. సీతారాం నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్‌(2015-18), డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా (హాల్‌టికెట్‌ నెంబరు 1791548430) బీకాం పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు.

అయితే, సీతారాం పేరు నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్‌ రికార్డుల్లో లేదని తమ విచారణలో తేలిందని నర్సిరెడ్డి తెలిపారు. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసిన తమ్మినేని సీతారాంను మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్‌ ఎలా పొందారో ప్రశ్నిస్తే సమాధానం లేదని విమ‌ర్శించారు. ఓయూకు సమర్పించిన సర్టిఫికెట్ల కాపీలను నర్సిరెడ్డి విడుదల చేశారు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం త‌మ్మినేనికి చుట్టుకుంటోంది. అయితే.. రాజ‌కీయంగా ఇది ఆయ‌న‌పై ప్ర‌భావం చూపించినా.. టెక్నిక‌ల్‌గా వ‌చ్చే ఇబ్బంది అయితే లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 14, 2023 1:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tammieni

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

2 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

8 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago