హవాలా కేసులో అరెస్టయి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒకేదెబ్బకు చాలామందిని ఇరికించేసినట్లే ఉన్నాడు. ఇరుక్కున్నది మామూలు వాళ్ళు కాదు ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి, మరో ఎంఎల్సీ లాంటి ప్రముఖులను. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీమంత్రి సత్యేంద్ర జైన్, బీఆర్ఎస్ ఎంఎల్సీ, కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవితలు తనతో చేసిన వాట్సప్ చాట్ ను సుఖేష్ బయటపెట్టాడు.
ఈ వాట్సప్ చాట్ లో తాను కవితకు రు. 15 కోట్లు ముట్టచెప్పినట్లు స్పష్టంగా ఉంది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో రు. 15 కోట్లు అరుణ్ కు అప్పగించానని సుఖేస్ చెబితే కవిత ఓకే అని సమాధానమిచ్చారు. అలాగే లిక్కర్ స్కామ్ లో డబ్బును ఎవరెవరికి ఎంతెంత అందించాననే విషయాలను కూడా వాట్సప్ ద్వారా సుఖేస్ బయటపెట్టారు. డబ్బులు మొత్తాన్ని కేజ్రీవాల్ తరపునే తాను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు చెప్పుకున్నారు.
తాజాగా బయటపడిన వాట్సప్ చాట్ ద్వారా లిక్కర్ స్కామ్ కన్నా ముందే ఆప్ తో కవితకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. స్కామ్ లో సంపాదించిన డబ్బంతా హైదరాబాద్ కేంద్రంగానే ఇతర దేశాలకు హవాలా మార్గంలో తరలివెళ్ళినట్లు అర్ధమవుతోంది. ఇదే విషయమై కవితను ఈడీ మూడుసార్లు విచారించింది. విచారణకు పిలిపించిన ప్రతిసారి అరెస్టు ఖాయమనే ప్రచారం జరిగింది కానీ అరెస్టయితే జరగలేదు.
మరి మూడుసార్లు విచారణలో ఈడీ ఎలాంటి ఆదారాలను సంపదించిందో తెలీదు. కానీ సుఖేష్ తాజాగా విడుదల చేసిన వాట్సప్ చాట్ లో మాత్రం లిక్కర్ స్కామ్ డబ్బులో కొంత కవితకు అందిందనే ఆధారం దొరికిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఇపుడు ఈడీ కవిత విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి పెరిగిపోతోంది. పైగా 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను తెలంగాణా పోలీసులు అరెస్టుచేశారు. ఈ నేపధ్యంలోనే సుఖేష్ వాట్సప్ చాట్ బయటపడటం ఇంట్రెస్టింగ్ గా మారింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on April 13, 2023 10:19 am
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…