జనసేన 41 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ సీట్లలో గెలిచే చాన్స్ ఉందని సీఎం జగన్ చేయించిన సర్వేలోనే తేలిందని జనసేన నేతలు చెప్తున్నారు. అయితే… జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ మాట చెప్పగానే వైసీపీ నుంచి భయంకరమైన అటాక్ మొదలవుతోంది. ‘పట్టుమని 10 మంది అభ్యర్థుల పేర్లు చెప్పండి చూద్దాం.. అప్పుడు మీకు 41 సీట్లు వస్తాయని నమ్ముతాం’ అంటూ ఎగతాళి చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ రెండు పార్టీల మాటల యుద్ధం సంగతి ఎలా ఉన్నా కానీ… జనసేన ఏమంత కొట్టిపారేసే స్థితిలో లేదని మాత్రం సీఎం జగన్ గట్టిగా నమ్ముతున్నారట. అందుకే.. జనసేన, టీడీపీ కలవకుండా ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారట.
ఇకపోతే జనసేన నాయకులు చెప్తున్న 41 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఒకే బలమైన అభ్యర్థి పేరు వినిపిస్తుండగా మరికొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట టికెట్ రానివారిని పొరుగు నియోజకవర్గాలలో సర్దుబాటు చేసే అవకాశాలనూ జనసేన నాయకత్వం పరిశీలిస్తోందని చెప్తున్నారు.
5 లోక్ సభ సీట్లు లెక్క కూడా జనసేన నేతలు చెప్తున్నారు. లోక్‌సభ సీట్లలో ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టతకు రానప్పటికి 5 నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గరు బలమైన అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి.
జనసేన గెలిచే అవకాశాలు ఉన్న 41 అసెంబ్లీ సీట్లు.. అభ్యర్థులు
1) తిరుపతి – పవన్ కల్యాణ్ లేదా కిరణ్ రాయల్
2) తెనాలి – నాదెండ్ల మనోహర్
3) సత్తెనపల్లి – బొర్రా వెంకట అప్పారావు లేదా శివపార్వతి
4) గన్నవరం – బండ్రెడ్డి రవి
5) గుడివాడ – సందు పవన్
6) పెడన – బూరగడ్డ శ్రీకాంత్
7) మచిలీపట్నం – బండి శ్రీకాంత్
8) అవనిగడ్డ – బండ్రెడ్డి రాము, బొండాడ రాఘవేంద్ర, రాయపూడి వేణుగోపాల్
9) పామర్రు- తాడిశెట్టి నరేశ్
10) పెనమలూరు – బొల్లం వీరేన్ కుమార్
12) ఉంగుటూరు – పత్చమట్ల ధర్మరాజు
13) దెందులూరు – ఘంటశాల వెంకటలక్ష్మి, కొఠారు ఆదిశేష్, డాక్టర్ సాయిశరత్
14) ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు
15) పోలవరం – చిర్రి బాలరాజు
16) చింతలపూడి – మేక ఈశ్వరయ్య
17) నూజివీడు – పాశం నాగబాబు
18) కైకలూరు – బీవీ రావు, కొల్లి వరప్రసాద్
19) ఆచంట – చేగొండి సూర్యప్రకాశ్
20) నరసాపురం – బొమ్మిడి నాయకర్
21) భీమవరం – పవన్ కల్యాణ్, కొటికలపూడి గోవిందరావు
22) ఉండి – జుత్తుగ నాగరాజు
23) తణుకు – విడివాడ రామచంద్రరావు
24) తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
25) రామచంద్రాపురం – పోలిశెట్టి చంద్రశేఖర్
26) ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ
27) అమలాపురం – శెట్టిబత్తుల రాజబాబు
28) రాజోలు – బొంతు రాజేశ్వరరావు
29) పి.గన్నవరం – కొమ్ముల కొండలరావు
30) కొత్తపేట – బండారు శ్రీనివాస్
31) మండపేట – వేగుల్ల లీలాకృష్ణ
32) తుని – గుణ్ణం నాగబాబు
33) ప్రత్తిపాడు – మేడిశెట్టి సూర్యకిరణ్
34) పిఠాపురం – మాకినీడి శేషుకుమారి
35) కాకినాడ రూరల్ – పంతం నానాజీ
36) పెద్దాపురం – తుమ్మల రామస్వామి బాబు
37) కాకినాడ – ముత్తా శశిధర్
38) జగ్గంపేట – పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర
39) అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు
40) భీమిలి – డాక్టర్ పంచకర్ల సందీప్
41) గాజువాక – పవన్ కల్యాణ్ లేదా కోన తాతారావు
వీటితో పాటు 5 లోక్ సభ సీట్లు.. మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, అమలపురం, కాకినాడలలో జనసేన పోటీ చేస్తే విజయం ఖాయమని చెప్తున్నారు.
This post was last modified on April 6, 2023 2:38 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…