Categories: Political News

కరోనా తగ్గిందని పార్టీ ఇచ్చాడు.. మళ్లీ వచ్చింది

ఇండియాలో కరోనా కేసులు వందకు చేరువగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌లో ఆ కేసులు 20 లోపే ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఇండియాలో కరోనా కేసులు 600 దాటగా.. పాకిస్థాన్‌లో రెట్టింపు సంఖ్యలో కరోనా బాధితులుండటం గమనార్హం. దీన్ని బట్టి పాకిస్థాన్‌లో ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే.

భారత్‌లోనే జనాలు ప్రభుత్వ సూచనల్ని ఆశించిన స్థాయిలో పాటించట్లేదు. నిర్లక్ష్య వైఖరితో కేసులు పెరిగేందుకు కారణమవుతున్నారు. ఇక పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. అక్కడి జనాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక కేసు ఉదాహరణ.

రావల్పిండికి చెందిన ఓ వ్యక్తికి రెండు వారాల కిందట కరోనా సోకింది. అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. అతను కోలుకున్నాడు. తర్వాత కరోనా టెస్టు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఇంటికి పంపించేశారు. ఐతే కరోనా నుంచి తాను కోలుకోవడాన్ని పెద్ద విజయంగా భావించిన ఆ వ్యక్తి 100 మంది స్నేహితులు, బంధువుల్ని పిలిచి పార్టీ ఇచ్చాడు.

ఐతే అందులో ఒక వ్యక్తికి కరోనా ఉండటం.. అతడితో ఈ వ్యక్తి సన్నిహితంగా మెలగడంతో మళ్లీ కరోనా సోకింది. ఆ ఇద్దరినీ మళ్లీ వైద్యుల పర్యవేక్షణలోకి పంపించారు. కోలుకున్నాక ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలని పోలీసులు భావిస్తున్నారట.

ఈ సంక్షోభ సమయంలో అతడికి పార్టీ ఇవ్వడానికి వనరులు ఎలా సమకూరాయి.. ఇతడికి బుద్ధి లేకపోయినా కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి పార్టీ ఇస్తే రావడానికి ఆ వంద మందికి ఎలా మనసొప్పింది అన్నది అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 1230 దాకా ఉండగా.. పది మంది దాకా ప్రాణాలు వదిలారు.

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

3 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

5 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

5 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

6 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

8 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

8 hours ago