అన్ని వేళ్లు ఆ ఒక్క‌డి వైపే…

మూల‌కార‌ణంబెవ్వ‌డు?! అన్న‌ట్టుగా.. వైసీపీ ప‌త‌నానికి ఆయ‌నే కార‌ణం అంటున్నారు.. వైసీపీలోని కీల‌క నాయ‌కులు.. పైకి పేరు చెప్పేందుకు కొంద‌రు సాహ‌సం చేయ‌క‌పోయినా.. త‌మ‌ను నానార‌కాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక కీల‌క స‌ల‌హాదారుపై వారు విరుచుకుప‌డుతున్నారు. “మేమేదో.. మాకు తెలు సు. మ‌ధ్య‌లో ఆయ‌న పెత్త‌నం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

వైసీపీలో ఒక‌ప్పుడు పార్టీ అధినేత జ‌గ‌న్‌కు.. నాయ‌కుల‌కు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉండేవి. నేరుగా ఆయ‌న‌తో మాట్లాడుకునేందుకు కూడా ఎలో చేసేవారు. అయితే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అన్ని ప‌ద్ధ‌తులు మారిపోయాయి. సీఎం జ‌గ‌న్‌ను ఒక ప్ర‌తిష్టాత్మ‌క నాయ‌కుడిగా తీర్చిదిద్దాల‌నే క్ర‌మంలో ఆయ‌న‌కు నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచార‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఇదే.. ఇప్పుడు పార్టీని న‌నిలువునా ముంచుతోంద‌ని అంటున్నారు.

అందుకే.. నేతల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఏ విష‌యంపై మాట్లాడాల‌న్నా.. ముందు గా సీఎంవో అనుమ‌తి.. త‌ర్వాత‌.. స‌ల‌హాదారు అనుమ‌తి తీసుకోవాల్సిన ప‌రిస్థితి పెరిగిపోయింద‌ని అం టున్నారు. దీనిని మెజారిటీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్ర‌ధానంగా గ‌త ఏడాది జ‌రిగిన మం త్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో స‌ద‌రు స‌ల‌హాదారు.. అన్నీతానై వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే.. త‌మ‌కు రావాల్సిన ప‌ద‌వులు రాకుండా .. పోయాయ‌నే వాద‌న‌ను చాలా మంది నాయ‌కులు చెబుతున్నారు.

గుంటూరు కు చెందిన వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంపైనా.. నాయ‌కుల్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా కొత్త‌గా వ‌చ్చిన వారికి కూడా మంత్రిప‌దువులు ఇవ్వ‌డం వెనుక స‌జ్జ‌ల చ‌క్రం తిప్పార‌నే వాద‌న కూడా వినిపించింది. వెర‌సి ఇవ‌న్నీ కూడా నేత‌ల‌ను పార్టీకి దూరం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు నిజానికి ఒక స‌ల‌హాదారు కార‌ణంగా.. పార్టీ మ‌రింత పుంజుకోవాల్సి ఉండ‌గా.. ఇప్పుడు దీనికి రివ‌ర్స్‌లో జ‌రుగుతుండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.