నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్.. అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. పాలిచ్చే ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య వచ్చిందని లోకేష్ అంటున్నారు.
టీడీపీ బీసీల పార్టీ అని, అన్న నందమూరి తారకరామారావు బీసీలకు పెద్ద పీట వేశారని లోకేష్ గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రజకులు, గీత కార్మికులు, పద్మశాలీలు,జాలర్లు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్పొరేషన్ల నిధులను స్వాహా చేశారని, టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులను కూడా ఆపేశారని ఆయన గుర్తు చేస్తున్నారు..
వైసీపీ నేతలు ఎస్సీ, ఎస్టీలపైనా…బీసీలపైనా దాడులు చేస్తున్నారన్నారు. బీసీ సామాజిక వర్గాలకు భద్రత లేకుండా పోయిందని లోకేష్ గుర్తు చేస్తున్నారు. మాట్లాడిన ప్రతీ చోట ఎవరెవరిపై, ఎక్కడ దాడి జరిగిందో చెబుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీల భద్రతకు చట్టం ఉన్నట్లే బీసీల భద్రతకు కూడా ఒక చట్టం తీసుకు వస్తామని లోకేష్ తెలిపారు. అధికారానికి వచ్చిన వెంటనే బీసీల భద్రతా చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు. అప్పుడు బీసీలపై దాడులు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు..
లోకేష్ తొందరపడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదీ వైసీపీకి లీకులు ఇచ్చినట్లే అవుతుందని అంటున్నాయి. లోకేష్ ప్రకటనలతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం తామే ఆ చట్టాన్ని తీసుకువచ్చి లబ్ధి పొందే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. అందుకే కొన్ని వ్యూహాలు గోప్యంగా ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి..
This post was last modified on March 29, 2023 1:49 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…