వరిస్తూనే ఉంటుంది. ఏపీ విపక్షం తెలుగుదేశం పని కూడా ఇప్పుడు అలానే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా క్లీన్ స్వీప్ చేశారో లేదో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయభేరీ మోగించారు. వైసీపీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించడమే విపక్ష పార్టీ గ్రేట్ సక్సెస్..
విజయం తెచ్చిన జోష్ ఇప్పుడు టీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందే డిసైడ్ చేసుకున్న ఇద్దరు కాకుండా మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేయడంతో నాలుగు తమకు లక్కి నెంబర్ అని, దానికి మంచి 23 లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్పుకుంటున్నారు. దీనితో అనుక్షణం పార్టీ నేతలు దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్ మినహా వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ వైపే చూస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గెట్లు తెరిచి చిటికేస్తే అందరూ వచ్చి తమ పక్కన కూర్చుంటారని, చంద్రబాబు చెప్పినట్లు వింటారని అంటున్నారు..
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు. నాలుగు కాదు నలభై అని వాళ్లు చెప్పుకుంటున్నారు. టీడీపీ ఓటేసిన నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసిన తీరును విమర్శిస్తూ వైసీపీ నుంచి ఇేంకా నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అనిత వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కొందరు టీడీపీ నేతలు ఇదే మాట చెప్పుకున్నారు. కనీసం 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే చంద్రబాబే వద్దని వారించారని డైలాగులు వదిలారు.
టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు కూడా అనిత తరహాలోనే పంచ్ డైలాగులు కొట్టారు. తమతో కలిసిపోయేందుకు 40 మంది రెడీగా ఉన్నారని ఆయన చెప్పుకున్నారు. అసలు జగనే తమకు ఓటేసి ఉండొచ్చని అచ్చెన్న అంటున్నారు. మరి విజయం తెచ్చిన జోష్ అలాంటిది కదా… టీడీపీ వాళ్లు కొన్ని రోజులు ఏమైనా మాట్లాడతారనుకోవాలి…
This post was last modified on March 29, 2023 11:58 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…